Top Ad unit 728 × 90

హోం మంత్రికి అనుమతి లేదు, ఎందుకో తెలుసా…!

హోం మంత్రికి అనుమతి లేదు, ఎందుకో తెలుసా…!

  

PSLV TV హైదరాబాద్: ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, అంతేకాదు హోం మంత్రి కూడా. అలాంటి సీనియర్ నేతకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశానికి అనుమతి దొరకలేదు. కరోనా పరిణామాలపై కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. అయితే ఇదే సమయంలో హోం మంత్రి మహమూద్ అలీ ప్రగతిభవన్‌కు వచ్చారు. కానీ ప్రగతి భవన్‌ లోపలికి వెళ్లకుండా ఆయన్ను భద్రతా సిబ్బంది ఆపేశారు. దీంతో చేసేదేంలేక ఆయన వెనుతిరిగారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అయితే అనుకోకుండా హోం మంత్రి వచ్చారని ఆయన కార్యాలయ సిబ్భంది చెబుతున్నారు. ఇక్కడ మరోక విషమం ఏమిటంటే హోం మంత్రి కింద పనిచేసే డీజీపీని ఈ సమావేశానికి అనుమతివ్వడం కొసమెరుపు.

అనుమతివ్వకపోవడానికి కారణాలు ఇవేనా!సమావేశానికి పిలిచినవారే రావాలనే కోరడమా? లేకపోతే మర్కజ్ యాత్రికులపై చర్చిస్తున్న నేపథ్యంలో ఈ సామాజికవర్గానికి చెందిన వారే హోం మంత్రి. అందులో పాతబస్తీకి చెందిన వారే యాత్రికుల్లో అధికంగా ఉన్నారు. అయితే మహమూద్ అలీ పాతబస్తీకి చెందిన వ్యక్తి కావడం వల్లే అనుమతించడం లేదనే వాదన వినిపిస్తోంది. మరోక విచిత్రం ఏమిటంటే మహమూద్ అలీ పోలీసులకు బాస్. ఆయన పరిధిలో పనిచేసే సిబ్బందే ఆయనకు అడ్డకట్ట వేయడం గమనార్హం. అయితే సీఎం నిర్వహిస్తున్న సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మర్కజ్ యాత్రికులను గుర్తించాలని, అందుకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. యాత్రలో పాల్గొన్న వారిని ఎంతమందిని గుర్తించారు. గుర్తించినవారిలో క్వారంటైన్‌కు తరలించారా? పాజిటివ్ కేసులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు.అయితే మరోక వాదన వినిపిస్తోంది. మర్కజ్‌లో జరిగిన ప్రార్థనకు సంబంధించి సమాచారం మహమూద్ అలీ వద్ద ఉంటుందని పలువురు అంటున్నారు. యాత్రకు ఎవరెవరు వెళ్లారు? ఎలా వెళ్లారు? ఇంతమందిని అక్కడి ఎలా తీసుకెళ్తారు? అనే సమాచారం ఆయనకు కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో సమావేశంలో పాల్గొని ఉంటే మహమూద్ అలీ నుంచి అదనపు సమాచారం వచ్చేది. ఈ సమాచారం ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో కీలకంగా మారేది. అయినప్పటికి ఆయన్ను గేటు బయట నుంచే బయటికి పంపడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

 

హోం మంత్రికి అనుమతి లేదు, ఎందుకో తెలుసా…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *