Top Ad unit 728 × 90

చీతా హెలికాప్టర్‌ క్రాష్‌ పైలెట్‌ మృతి...!

చీతా హెలికాప్టర్‌ క్రాష్‌ పైలెట్‌ మృతి...!

 

చీతా హెలికాప్టర్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ కూలిపోయినట్లు భారత ఆర్మీ పేర్కొంది. ఈ ఘటనలో పైలెట్‌, మృతి చెందగా, కో పైలెట్‌ తీవ్ర గాయాలపాలైనట్లు వెల్లడించింది. ఈ ప్రమాదం తవాంగ్‌ ప్రాంతంలో ఉదయం 10 గం.ల సమయంలో జరిగినట్లు తెలిపారు. ఈ చీతా హెలీకాప్టర్‌లో ఇద్దరు పైలెట్‌లు ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే ఇద్దరు పైలెట్‌లను ఆర్మీ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఐతే లెఫ్టినెంట్‌ సౌరభ యాదవ్‌ పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. అలాగే కో పైలెట్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఇదే ఏడాది మార్చిలో మరో చీతా హెలికాప్టర్‌ జమ్ము కాశ్మీర్‌ సరిహద్దుల్లో కూలిన సంగతి విధితమే. ఆఘటనలో కూడా పైలెట్‌ మృతి చెందగా, కోపైలెట్‌కి తీవ్ర గాయాలపాలయ్యాడు.

 

చీతా హెలికాప్టర్‌ క్రాష్‌ పైలెట్‌ మృతి...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *