Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

బ్యాంక్ అకౌంట్ తెరిచే ముందు ఈ చార్జీల గురించి తప్పక తెలుసుకోండి…! ఉప్పు గురించి సంపూర్ణ వివరణ…! ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 15 జూలై 2020 3 నెలల లాక్ డౌన్ తర్వాత కొత్త ఉత్సాహంతో రేడివుతున్న బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్‌.. ఏపీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు చర్యలు ప్రారంబించిన  ఉన్నతాధికారులు.. కరోన వైరసును ఎదుర్కునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు  చేస్తున్న  రైల్వే శాఖ అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై  వాయుద వేసిన  ఏపీ హైకోర్టు. కరోనాతో మృతిచెందితే అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి రూ 15వేలు ఇవ్వాలనన్న ఏపి ముఖ్యమంత్రి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాము రేపుటి నుంచి మూసివేయునున్నర..? బీహార్‌లో సంపూర్ణ లాక్ డౌన్…!   

కేజ్రీవాల్ సంచలన నిర్ణయం, బిజెపి షాక్

కేజ్రీవాల్ సంచలన నిర్ణయం, బిజెపి షాక్

 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలలో విజయం సాధించగా బీజేపీ పార్టీ కేవలం 8 స్థానాలలో విజయం సాధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ఫలితాల తరువాత మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ను స్టార్ట్ చేయగా కేవలం ఒక్క రోజులోనే 11 లక్షల మంది క్యాంపెయిన్ ద్వారా భాగస్వాములయ్యారు.

ఢిల్లీలో వరుస విజయాలతో దేశవ్యాప్తంగా పార్టీ గుర్తింపు తెచ్చుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గతంలో ఇతర రాష్ట్రాలలో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఇతర రాష్ట్రాలలో పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగి మోదీ, అమిత్ షాలకు ఊహించని షాక్ ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయాలని కేజ్రీవాల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ ఇకపై దేశంలో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని కేజ్రీవాల్ పంజాబ్ తో పాటు ఇతర అసెంబ్లీ ఎన్నికలపై కూడా దృష్టి పెట్టనున్నారని తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ప్రజల్లోకి విసృతంగా వెళ్లి వాలంటీర్లను సిద్ధం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రేమ, గౌరవం లక్ష్యంగా ప్రచారం చేస్తూ సానుకూల జాతీయవాదాన్ని అనుసరిస్తోందని బీజేపీ పార్టీ మాత్రం ద్వేషం, విభజన రాజకీయం మొదలైన అంశాలతో ప్రతికూల జాతీయ వాదాన్ని అనుసరిస్తోందని గోపాల్ రాయ్ చెప్పారు. యావత్ దేశానికే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రయోగం ఆదర్శంగా నిలుస్తుందని గోపాల్ రాయ్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేలా కేజ్రీవాల్ ప్రయత్నాలు చేయడం మోదీ, అమిత్ షాలకు షాక్ అనే చెప్పవచ్చు.

కేజ్రీవాల్ సంచలన నిర్ణయం, బిజెపి షాక్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *