Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 15 జూలై 2020 3 నెలల లాక్ డౌన్ తర్వాత కొత్త ఉత్సాహంతో రేడివుతున్న బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్‌.. ఏపీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు చర్యలు ప్రారంబించిన  ఉన్నతాధికారులు.. కరోన వైరసును ఎదుర్కునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు  చేస్తున్న  రైల్వే శాఖ అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై  వాయుద వేసిన  ఏపీ హైకోర్టు. కరోనాతో మృతిచెందితే అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి రూ 15వేలు ఇవ్వాలనన్న ఏపి ముఖ్యమంత్రి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాము రేపుటి నుంచి మూసివేయునున్నర..? బీహార్‌లో సంపూర్ణ లాక్ డౌన్…! ఆకాశంలో అరుదైన దృశ్యం, భారత్‌కి దగ్గరగా తోకచుక్క...! అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ విండోస్ 10కి వచ్చింది చూశారా...!   

జూన్  2020  ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు

జూన్  2020  ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు

 

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి: ఈ నెలలో బుధుడు స్థానచలనం వల్ల మేషరాశి వారికి మంచి ఫలితాలు ఉండనున్నాయి. శుభవార్తలు వింటారు. త్వరలో కొన్ని మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆధాత్మికత, దైవారధన వైపు మనసు మళ్లుతుంది. కుటుంబ సభ్యులతో మీ అనుబంధం మరింత మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీ తోబుట్టువులు, సోదరులతో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే మధ్యలో కొన్ని కఠిన పరిస్థితులు వచ్చినప్పటికీ వాటిని మళ్లీ పరిష్కరించుకుంటారు. నూతన ఆలోచనలు కార్య రూపం దాల్చును. మిత్ర వర్గంతో ఉన్న వివాదములు తొలగును. ఉద్యోగ జీవనంలో అభీష్టాలు సిద్ధించును. నూతన అధికారములు లభించును. వ్యాపార వర్గం వారికి మంచి ప్రోత్సాహకరమైన కాలం. ఈ మాసంలో 12 నుండి 16 వ తేదీల మధ్య కాలంలో వ్యక్తిగత జీవనమునకు సంబంధించిన ఒక శుభ పరిణామం ఏర్పడును. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలు కలసివచ్చును. 24 తేదీ తదుపరి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల వలన అశాంతి, ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

వృషభరాశి: ఈ నెలలో చేసే పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. కాబట్టి మీరు ఏయే రంగాల్లో ఉంటారో ఆ రంగంలో ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు కచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ శుభ సమయాన్ని మీ కెరీర్ కు ఉపయోగించుకోవండి. కొత్త ప్రాజెక్టులు, ఆలోచనలపై దృష్టి పెట్టడం వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యక్తిగత జీవన విషయాలలో సౌఖ్యం ఉన్నది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలనుండి ఉపశమనం లభించును. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. సామజిక కార్యక్రమాలలో మీ శ్రమకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. గౌరవింప బడతారు. స్థాన చలన ప్రయత్నాలు, ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు లాభించును. నిరుద్యోకులకు ద్వితీయ, తృతీయ వారములలో మంచి అవకాశములు లభించును. రాజకీయ పలుకుబడి పనికి వచ్చును. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం బాగుండును. వ్యాపార వ్యవహారములు ఆశించిన విధంగా కొనసాగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి: ఈ నెలలో ఎంతో కాలం నుంచి వేదిస్తున్న కార్యకలపాలు ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇదే సమయంలో నైపుణ్యంగలవారిపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఫలితంగా బుధుడు వారికి ఎక్కువ వృద్ధిని, పేరును తీసుకొస్తుంది. కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడపాడానికి ఇదే మంచి సమయం. మొత్తం మీద మిథున రాశిపై బుధుడి ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. అంతేకాకుండా రాహువు కూడా బుధుడితో పాటు ఉండటం వల్ల మీ ఆలోచనలకు విశ్రాంతినివ్వాలి. కొత్త ఆలోచనలు మైండ్ లోకి వచ్చినా నిర్ణయాలు తీసుకోవడానికి కొద్దిగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రారంభ మూడు వారాలు గత మాసంలో వలె శుభ ఫలితాలు పొందుదురు. ఆశించిన ధనాదాయం చేతికి వచ్చును. మనసులో ఉన్న ఒక బలమైన కోరిక నెరవేరును. అన్ని విధములా కుటుంబ సహకారం లభించును. ముఖ్యంగా కుటుంబ సభ్యుల వలన వ్యయం అధికం. ప్రైవేటు ఉద్యోగులకు పనులు అస్తవ్యస్తం అవుతాయి. 23 వ తేదీ తదుపరి వేడుకలకు, విందు వినోదాలకు దూరంగా ఉండుట మంచిది. మాసాంతంలో పెద్దలతో వాగ్వివాదాలకు అవకాశం ఉన్నది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను, నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది

 

కర్కాటకరాశి: ఈ నెలలో మంచి ఫలితాలను అందుకుంటారు. ఎన్నో ప్రతికూల ఆలోచనలు మైండ్ లోకి వస్తాయి. అయితే కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడిపుతారు. ఈ కాలంలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. కళాత్మాక పనులు, అసంపూర్తిగా పనులను ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీరు మీ పనిని తెలివితేటలు, సమర్థవంతమైన వాగ్ధాటితో పూర్తిచేస్తారు. ఆర్ధిక విషయాలు కొంత బాగుంటాయి. వ్యాపారములలో ఆదాయం గత మాసాల కన్నా పెరుగుతుంది. కొద్దిపాటి ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆశించిన ధనాదాయం లభించును. వృధా వ్యయం కూడా తగ్గుతుంది. ఉద్యోగ జీవనం వారికి ప్రధమ, ద్వితీయ వారాలలో కొన్ని పొరపాట్లు చేయుట వలన ఇబ్బందులు ఉన్నాయి. ఏకాగ్రతతో పనిచేయాలి. కుటుంబ బంధాలపై ఆలోచన అవసరం. రక్త సంబంధాల విలువ అర్ధం చేసుకోవాలి. ఈ మాసంలో 16 నుండి 19 వ తేదీల మధ్య కాలం కుటుంబ విషయాలకై చర్చించుటకు మంచి రోజులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి: ఈ నెలలో కూడా అనుకూల ఫలితాలు కొనసాగును. బంధు వర్గం సహకారం వలన చక్కటి వివాహ సంబంధాలు లభించును. వ్యక్త్రిగత వైవాహిక జీవనంలో కూడా అపార్ధాలు తొలగును. సౌఖ్యం ఏర్పడును. విందు వినోదాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు లభిస్తాయి. నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకొందురు. ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు పొందుతారు. నూతన కాంట్రాక్టులు , విదేశే జీవన అవకాశాలు లభిస్తాయి. నూతన పరిచయాలు నిరుత్సాహ పరుచును. సేవా రంగంలోని వారు లక్ష్యాలను చేరుకొందురు. మొహమాటం వలన నష్టపోదురు. ఈ మాసంలో ప్రయాణాలు కలసిరావు. అవాంతరాలను ఏర్పరచును. అనుకూలమైన శుభాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను, నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది.

 

కన్యారాశి: ఈ నెలలో సాంకేతిక రంగంలో ఉన్నవారికి విజయం చేకూరుతుంది. ఈ రంగంలో మీ తెలివి తేటలు, విజ్ఞానం ద్వారా సానుకూల ఫలితాలు నమోదవుతాయి. అంతేకాకుండా గౌరవాన్ని పొందుతారు. రాహువు, బుధుడుతో ఉండటం వల్ల ఈ సమయంలో వ్యాపారస్థులకు లాభాన్ని అందుకుంటారు. మీరు మాట్లాడేటప్పుడు మాటలపై సంయమనం పాటించండి. మీ శారీరక ఆనందం కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ధనాదాయం సామాన్యం. బంధు వివాదాలు, నూతన పరిచయాల వలన నష్టం ఎదురగును. ముఖ్యంగా పితృ వర్గీయులతో మాట్లాడునపుడు జాగ్రత్త అవసరం. 10వ తేదీ తదుపరి వ్యక్తిగత జీవితంలో నిరాశకు గురిచేయు సంఘటనలు ఎదుర్కొందురు. భవిష్యత్ గురించిన ఆలోచనలు చేయాలి. అతి ధైర్యం పనికిరాదు. పనులు వాయిదా వేయకండి. పట్టుదల ప్రదర్శించాలి. ఈ మాసంలో 6, 7, 11, 13 తేదీలలో ఇబ్బందులు అధికమగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులరాశి: ఈ నెలలో కుటుంబ వివాదాలు ఉన్నా ఆర్ధిక లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభ వార్త. నూతన ప్రాజెక్ట్లు లభిస్తాయి. నూతన అధికారాలు పొందుతారు. వాహన యోగం ఉన్నది. గృహంలో కుటుంబ సభ్యులతో సామరస్యంతో వ్యవహరించాలి. విదేశీ జీవన ప్రయత్నాలలో సమస్యలు ఎదురగును. తృతియ వారంలో వృధా ప్రయాణాలు చేస్తారు. సమయ పాలనలో విఫలమవుతారు. శారీరక శ్రమ వలన అశాంతి కలుగును. చివరి వారంలో మీ చేతిపై పుణ్యకార్యములు జరుగును. శుభ కార్యములకు ధనం వ్యయమగును. స్త్రీలకు స్థిరాస్తి సంబంధ లాభం ఏర్పడును. గురువుల ఆశీస్సులు లభించును. ఈ మాసంలో 2, 17, 23, 24 తేదీలలో పితృ వర్గీయులకు ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను, త్రాగడానికి నీళ్ళను వాటికి అందివ్వండి.

 

వృశ్చికరాశి: ఈ నెలలో ఉద్యోగ జీవనంలో ఆశించిన విధంగా పై అధికారుల గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్లకు అవకాశములు ఉన్నాయి. ఉద్యోగ జీవనంలో ఉన్నతి, నూతన భాద్యతలు లభిస్తాయి. వ్యాపారాదులలో ఆశించిన స్థాయిలో లాభములు కొనసాగును. కుటుంబములో మీ మాట విలువ పెరుగును. విద్యార్ధులకు సంకల్ప సిద్ధి ఏర్పడును. తృతీయ వారంలో విహార యాత్రలు, విందు, వినోదాల వలన సంతోషంగా సమయం గడచును. జీవిత భాగస్వామితో వ్యక్తిగత జీవనంలో సోఖ్యం. బాగా ఎదిగిన సంతానం వలన ఆర్ధిక లేదా వాహన ప్రయాణ సౌఖ్యం. కుటుంబ భాద్యతలను తీసుకొంటారు. స్థిరాస్తి తగాదాలలో రాజీ ప్రయత్నాలు ఫలించును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు పేదల కొరకు మీ చేతనైన సహాయం చేయండి శుభం కలుగుతుంది.

 

ధనస్సురాశి: ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. వ్యక్త్రిగత జీవనంలో అవిధేయత వలన చికాకులు. ద్వితియ తృతీయ వారములలో ఉద్యోగ మరియు వ్యాపారములలో ఆఖస్మిక ఇబ్బందులు. శ్రమకు తగిన ఫలితం లభించదు. ఉన్నత హోదాలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడును. వివాహ ప్రయత్నాలలో అడ్డంకులు. మాసాంతంలో ఆర్ధిక పరంగా కొంత వృద్ది ఏర్పడును. వ్యవసాయ సంభందిత రంగంలోని వారికి తీవ్ర వ్యయం ఏర్పడును. విద్యార్ధులకు ఈ మాసం అంత మంచి కాలం కాదు. విద్యావిఘ్నములను ఎదుర్కోను సూచన. మాసం మొత్తం మీద ధనాదాయం సామాన్యం.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి: ఈ నెలలో  నూతన ఆదాయ మార్గములు లభించును. వ్యాపారములు మంచి అభివృద్ధికర మార్గంలో కొనసాగును. భాత్రు వర్గంతో ఆధిపత్య సంబంధ విరోధములు ఏర్పడును. ద్వితీయ వారం సామాన్య ఫలితాలను కలుగచేయును. తృతీయ వారంలో మిత్రుల వలన ఒక ఆర్ధిక నష్టం ఎదుర్కొందురు. కుటుంబ పరంగా సిద్ధంగా లేని ఖర్చులు ఎదుర్కొందురు. వివాహ ప్రయత్నములలో ఆశాభంగం ఏర్పడును. ఈ మాసంలో బ్యాంకు లేదా బంగారు ఆధారిత ఋణములు తీసుకొనుట, ఇతర ఆర్ధిక పరమైన విషయాలలో పాల్గొనుట అంత మంచిది కాదు. కుటుంబ పెద్దల సలహా పాటించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

కుంభరాశి: ఈ నెలలో ధనాదాయం బాగుండును. వ్యక్తిగత జీవితంలో శుభకరమైన ఫలితాలు ఏర్పడును. నూతన వ్యాపార ప్రారంభకులకు కార్య సిద్ధి లభిస్తుంది. స్త్రీలు ఆశ్చర్యకరమైన బహుమతులు పొందుతారు. ప్రధమ, ద్వితీయ వారములలో తలపెట్టిన ప్రయాణాలు సౌఖర్య్యవంతంగా పుర్తిఅగును. తృతీయ వారంలో అఖస్మిక శారీరక రుగ్మతలు చికాకులను కలుగచేయును. జీవిత భాగస్వామి తరపు బంధువులతో అనిశ్చితి ఏర్పడును. వారి నుండి కృతజ్ఞతను ఆశించ వద్దు. చివరి వారం సామాన్య ఫలితాలను కలుగచేయును. మొత్తం మీద ఈ మాసంలో ధనానికి లోటు ఏర్పడదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి: ఈ నెలలో అతి కష్టం మీద వివాహ ప్రయత్నాలు ఫలించును. ధనాదాయం బాగుండును. పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఉన్న పరిచయాల వలన లాభములు ఏర్పడును. వృత్తి వ్యాపారములు సామాన్యం. జీవిత భాగస్వామి మూలక ధన లాభములు. మాసం మొత్తం మీద ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను, త్రాగడానికి నీళ్ళను వాటికి ఏర్పాటు చేయండి.

 

జూన్  2020  ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *