Top Ad unit 728 × 90

పేషావర్‌లో పేలుడు ఏడుగురు మృతి 70 మందికి గాయాలు...!

పేషావర్‌లో పేలుడు ఏడుగురు మృతి 70 మందికి గాయాలు...!

 

పాకిస్థాన్‌లోని పేషావర్‌లో దారుణం జరిగింది. ఓ శిక్షణ స్కూల్‌లో జరిగిన పేలుడులో ఏడుగురు మృతిచెందారు. ఆ ఘటనలో మరో 70 మంది గాయపడ్డారు. పేలుడు ఘటనకు సంబంధించి విచారణ చేపట్టనున్నట్లు పేషావర్ పోలీసు ఆఫీసర్ మన్సూర్ అమన్ తెలిపారు. ఐఈడీతో పేలుడుకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు.. క్లూస్ సేకరిస్తున్నారు. స్కూల్‌లో ఖురాన్ పాఠాలు బోధిస్తున్న సమయంలో పేలుడు జరిగినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ఎవరో ఓ వ్యక్తి బ్యాగ్‌తో ఆ శిక్షణాలయంలోకి వెళ్లినట్లు తెలిపారు. గాయపడ్డవారిలో చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. మతపరమైన శిక్షణ తరగతులు జరుగుతున్న బిల్డింగ్‌లో పేలుడు జరగడం వల్ల చిన్నారులు, శిక్షకులు ఎక్కువ సంఖ్యలో గాయపడ్డారు. బ్యాగ్‌లో ఉన్న బాంబు.. టైమ్ బాంబు అయి ఉంటుందని కూడా భావిస్తున్నారు. దాదాపు అయిదు కిలోల పేలుడు పదార్దాలు వాడినట్లు అనుమానిస్తున్నారు. పేషావర్‌లోని స్పీన్ జమాత్ మసీదులో ఈ పేలుడు జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.30 నిమిషాలకు ఈ పేలుడు ఘటన సంభవించింది. పేలుడు ధాటికి మసీదులోని ప్రార్థనామందిరం పూర్తిగా ధ్వంసమైంది. సీలింగ్ కూడా ఊడిపడింది. అయితే ఇదేమీ ఆత్మాహుతి దాడి కాదు అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మసీదులో ఉన్న బ్యాగులో పేలుడు పదార్ధాలు ఉండి ఉంటాయని అనుమానిస్తున్నారు.

పేషావర్‌లో పేలుడు ఏడుగురు మృతి 70 మందికి గాయాలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *