ఇజ్రాయెల్, ఇరాన్ చమురు కర్మాగారాలపై దాడి చేయవచ్చట...!
ఇజ్రాయెల్, ఇరాన్ చమురు కర్మాగారాలపై దాడి చేయవచ్చట...!
ఇరాన్ చమురు కర్మాగారాలపై ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉందని, ఇదే అంశంపై చర్చిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అయితే, తక్షణమే ఇజ్రాయెల్ ఈ దాడులు మొదలుపెడుతుందని అనుకోవడం లేదన్నారు. వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు మద్దతిస్తారా...?అన్న ప్రశ్నకు జో బైడెన్ ఈ విధంగా స్పందించారు. బైడెన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయిల్ ధరలు ఐదు శాతం పెరగడం గమనార్హం.
''మొదటి విషయమేంటంటే, ఇజ్రాయెల్ దాడులను మేం అనుమతించం. ఈ రోజు మాత్రం అటువంటిదేం జరగదు'' అని జో బైడెన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని సమర్థించనన్నారు.
Click Here: Lord Venkateswara swamy song | శ్రీ వెంకటేశ్వర స్వామీ స్తుతి
ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఇటీవల పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేయడాన్ని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇరాన్‌పై ఏ క్షణమైనా దాడులు చేయవచ్చనే ఆందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇరాన్‌లోని చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీనిపై కొంత క్లారిటీ ఇవ్వడం గమనార్హం.