Top Ad unit 728 × 90

హంటర్ 350 సూపర్ హిట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు కూడా బంపర్ హిట్...!

హంటర్ 350 సూపర్ హిట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు కూడా బంపర్ హిట్...!

 

పంచంలోని అత్యంత పురాతన మోటార్‌సైకిల్ బ్రాండ్లలో ఒకటైన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield), ప్రస్తుతం భారతదేశంలో 350సీసీ మోటార్‌సైకిల్ విభాగంలో తన అధిపత్యాన్ని కొనసాగిస్తోంది.ప్ర క్లాసిక్ 350, మీటియోర్ 350 మరియు కొత్తగా వచ్చిన హంటర్ 350 వంటి మోడళ్లతో కంపెనీ ఈ విభాగంలో బలమైన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని మరియు అమ్మకాలను కలిగి ఉంది. గడచిన సెప్టెంబర్‌ 2022 నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 82,097 మోటార్‌సైకిళ్లను విక్రయించి, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 145 శాతం వృద్ధిని నమోదు చేసింది.

 

రాయల్ ఎన్‌ఫీల్డ్ సెప్టెంబర్ 2021 నెలలో కేవలం 33,529 ద్విచక్ర వాహనాలను మాత్రమే విక్రయించింది. అయితే, సెప్టెంబర్ 2022 నెలలో కంపెనీ అమ్మకాలు 82,097 యూనిట్లుగా నమోదయ్యాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి కొత్తగా వచ్చిన హంటర్ 350 ఆశించినదాని కన్నా ఎక్కువ విజయం సాధించడంతో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్ర వాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 144.85 శాతం వృద్ధిని సాధించాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి తాజాగా మార్కెట్లోకి వచ్చిన హంటర్ 350 మోటార్‌సైకిల్ కంపెనీ అందించే ఇతర 350 సిసి మోటార్‌సైకిళ్ల కంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది. స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్ మాదిరిగా ఉండే హంటర్ 350, ఆధునికమైన రెట్రో డిజైన్‌ను కలిగి ఉంటుది. హంటర్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ మరియు కొత్త క్లాసిక్ 350లో ఉపయోగించిన J-సిరీస్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ సహాయంతో 20 బిహెచ్‌ పిపవర్ మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 

హంటర్ 350 సూపర్ హిట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు కూడా బంపర్ హిట్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *