బంగారాన్ని బయటకి చిమ్ముతున్న అగ్నిపర్వతం…!
బంగారాన్ని బయటకి చిమ్ముతున్న అగ్నిపర్వతం…!
భూమిపై ఎక్కడో ఒకచోట అగ్నిపర్వతాలు భగ్గుమంటూనే ఉంటాయి. నిత్యం లావాను స్రవిస్తూ ఉంటాయి. అలా ఒక అగ్నిపర్వతం లావాతో పాటు బంగారాన్ని కూడా చిమ్ముతోంది. ఇది అంటార్కిటికా ఖండంలో ఉంది. భూమిపై అత్యంత శీతల ప్రదేశం అంటర్కిటికా. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 129 ఫారెన్‌హీట్ దగ్గర ఉంటాయి. ఎముకలు కూడా గడ్డకట్టుకుపోయే చలి. అలాంటి పరిస్థితుల్లో కూడా మంచు కింద ఉన్న ఒక అగ్నిపర్వతం భగ్గుమంది. దాని పేరు మౌంట్ ఎరెబిస్.
భూమిపై అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం మౌంట్ ఎరెబిస్. ఇది 12448 అడుగుల ఎత్తులో ఉంది. ఇది సాధారణ అగ్నిపర్వతం కాదు, అగ్నిపర్వత బాంబులుగా పిలిచే రాళ్లు, గ్యాస్, ఆవిరిని చిమ్ముతున్న ఒక భౌగోళిక అద్భుతం. అయితే ఈ అగ్నిపర్వతం స్పెషాలిటీ అది బంగారాన్ని చిన్న స్పటికాల రూపంలో, ద్రవ రూపంలో విడుదల చేస్తోంది.
నివేదికల ప్రకారం ఈ అగ్నిపర్వతం ప్రతిరోజూ 80 గ్రాముల బంగారాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. చాలా సూక్ష్మ రూపంలో, స్పటికాల రూపంలో ఈ బంగారం బయటికి వస్తూ ఉంటుంది. ఈ అగ్నిపర్వతం కణాలు ఆ పర్వతం నుండి 600 మైళ్ళ దూరంలో కూడా కనబడ్డాయి. అంటే ఎంతగా అది చిమ్ముతోందో అర్థం చేసుకోండి. బంగారాన్ని అగ్నిపర్వతం దాని లోహ రూపంలో కూడా విడుదల చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇలా బంగారాన్ని బయటికి చిమ్ముతున్న ఏకైక అగ్నిపర్వతం ఇదే.
ఈ అగ్నిపర్వతంతో ముడిపడి ఒక విషాద ఘటన కూడా ఉంది. 1979లో ఎయిర్ న్యూజిలాండ్ కు చెందిన ఒక విమానం 257 మందితో అంటార్కిటిగా మీదుగా ప్రయాణం చేసింది. ఆ సమయంలో విమానం ఈ అగ్నిపర్వతాన్ని ఢీ కొట్టి కూలిపోయింది. ఆ విమానంలో ఉన్న అందరూ మరణించారు.
Kubera ashta lakshmi mantra with Lyrics | కుబేర అష్టలక్ష్మి మంత్రం
బంగారాన్ని చిమ్ముతోంది కదా దాన్ని ఏరుకోవడానికి వెళదామంటే ఎవరికీ కుదరదు. ఆ ప్రాంతంలో మనుషులు తిరగడం చాలా కష్టం. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ఆ ప్రాంతానికి వెళ్లాలి. అందుకే ఆ బంగారం అంతా అలా గడ్డకట్టుకుపోయి ఉండిపోయింది. శాస్త్రవేత్తలు మాత్రం కొంతమేరకు పరిశోధనల కోసం సేకరించగలిగారు.
ఆ పర్వతానికి 1841లో గ్రీకు దేవుడైన ఎరెబిస్ పేరును పెట్టారు. ఎరెబిస్ అనే వ్యక్తి గ్రీకు దేశంలో చీకటి ప్రాంతానికి దేవుడు. ఈ అగ్నిపర్వతం కూడా మంచు కింద కప్పి అండర్ వరల్డ్‌లో ఉందని చెప్పేందుకు ఆ గ్రీకు దేవుడి పేరును ఈ అగ్నిపర్వతానికి పెట్టారు. అలా ఈ మౌంట్ ఎరెబిస్ పేరు పుట్టుకొచ్చింది.