Top Ad unit 728 × 90

UPDATES

నేటి మంచిమాట: అసమర్ధులకు అవరోధాలుగా కనిపించేవి సమర్ధులకు అవకాశాలుగా కనిపిస్తాయి-డా. యర్రం పూర్ణశాంతి భారతీయ రైల్వే పండ్లు, కూరగాయలను రవాణా చేయడానికి ఇవాళ (ఆగస్టు 7) తన మొదటి 'కిసాన్ రైల్' సేవను ప్రారంభించబోతోంది. ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలాన్ని పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పదిగ్రాముల పసిడి ఏకంగా 57,008 రూపాయలకు పెరిగింది. మరోవైపు వెండి ధర కిలోకు 576 రూపాయలు భారమై 77,840 రూపాయలు పలికింది. లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 123 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

అక్కడ కొడితే ఇక చైనా కొలుకోలేదు...!

అక్కడ కొడితే ఇక చైనా కొలుకోలేదు...!

 

చైనాకు షాకుల మీద షాకులిస్తోంది భారత ప్రభుత్వం. 59 యాప్స్ బ్యాన్ చెయ్యడమే పెద్ద షాక్ అనుకుంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడక్‌కి సడెన్‌గా వెళ్లడం మరో ట్విస్ట్. తాజాగా కేంద్ర ప్రభుత్వం అండమాన్ నికోబార్ దీవులపై యుద్ధ సన్నద్ధతను పెంచబోతోంది. శత్రువుతో యుద్ధానికి దిగేటప్పుడు డైరెక్టుగా మాత్రమే వెళ్తే సరిపోదు, నలు దిశల నుంచి ఎటాక్ చెయ్యాలి అనే ఫార్ములాను ఫిక్స్ చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమెరికా, రష్యాల సాయం తీసుకుంటోంది. భారీగా యుద్ధ విమానాల్ని కొంటోంది. అలాగే సైన్యానికి రూ.500 కోట్లు ఇచ్చి అవసరమైన సామాగ్రి కొనుక్కోమంది. అంతేకాదు, ఫాస్ట్ ట్రాక్ ప్లాన్లలో భాగంగా అదనపు మిలిటరీని అండమాన్ నికోబార్ దీవులకు పంపిస్తోంది. వారితోపాటూ భారీగా ఆయుధాలు, అవసరమైన యుద్ధ సామగ్రిని కూడా తరలిస్తోంది.

నిజానికి అండమాన్‌ను సరికొత్త యుద్ధ తంత్రంగా మార్చాలనే ప్లాన్స్ ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌‌లో ఉన్నాయి. ఇన్నాళ్లూ అలాంటి అవసరం అంతగా కనిపించలేదు. కానీ ఇప్పుడు చైనా తీరుతో పరిస్థితి మారిందని కేంద్రం భావిస్తోంది. 2001లో అండమాన్ నికోబార్ కమాండ్ (ANC) ఏర్పాటైంది. ఇప్పటికీ దాని పరిధిలోనే త్రివిధ దళాలు మూడూ అక్కడ పనిచేస్తున్నాయి. కానీ ANC పేరుకే అన్నట్లు తయారైంది. దానికి సరైన నిధులు లేవు. భవనాలు లేవు. పర్యావరణ అనుమతులు చాలావరకూ పెండింగ్ ఉన్నాయి. ఏ యుద్ధమైనా వస్తే, ANC చేతులెత్తేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్ని ఆధునీకరిస్తూ కేంద్రం మరింత బలాన్ని పెంచుతోంది.

అండమాన్ నికోబార్‌లో మన సైన్యం పెరిగే కొద్దీ చైనాకు ఇబ్బంది తప్పదు. ఎందుకంటే, చైనా సముద్ర మార్గాలను టార్గెట్ చెయ్యడానికి అండమాన్ బేస్ బాగా ఉపయోగపడుతుంది. చైనాకి చాలా వరకూ సముద్రం ద్వారానే ఎగుమతులు, దిగుమతులూ జరుగుతున్నాయి. అలాగే, చైనా తనకు కావాల్సిన ముడి చమురును కూడా సముద్ర మార్గాల్లో తెప్పించుకుంటోంది. ఒకవేళ చైనా యుద్ధానికి దిగితే, అండమాన్ నుంచి చైనా సముద్ర రవాణాకి భారత్ చెక్ పెట్టగలదు. ముఖ్యంగా చమురు నౌకల్ని నాశనం చేస్తే, ఇక చైనా చేయగలిగేది ఏమీ ఉండదు. అందుకే ఇప్పుడు కేంద్రం అండమాన్‌ను యుద్ధ తంత్రంగా మార్చబోతోంది.

అండమాన్‌లో ఇప్పటికే తీసుకున్న చర్యల్లో పర్యావరణ అనుమతులు చాలా వరకూ ఇచ్చేసింది కేంద్రం. వచ్చే పది రోజుల్లో మరిన్ని అనుమతులు, ఆయుధాల తరలింపుతో చైనాకి షాకివ్వబోతోంది. మొత్తం రూ.5650 కోట్లతో వచ్చే ఏడేళ్లలో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయబోతోంది. మిగ్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్డ్‌లు, మారిటైమ్ పెట్రోల్ పేన్లు ఇలా చాలావాటిని తరలించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

 

జయహో భారత్

అక్కడ కొడితే ఇక చైనా కొలుకోలేదు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *