Top Ad unit 728 × 90

దేశంలో 16 వేలకు పైగా నమోదైన కరోనా కేసులు

దేశంలో 16 వేలకు పైగా నమోదైన కరోనా కేసులు, నిన్న ఎన్ని మరణాలంటే...?

 

దేశంలో కరోనా కేసులు ప్రతిరోజూ క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

 

కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,167 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,35,510 (0.31 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 6.14 శాతం ఉండగా... రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది.

 

దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా గణాంకాలు...

  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,41,61,899 కి పెరిగింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,26,730 కి చేరింది.
  • నిన్న కరోనా నుంచి 15,549 మంది కోలుకున్నారు.
  • వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,34,99,659 కి చేరింది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 206.56 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • దేశంలో నిన్న 34,75,330 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

 

 

#COVID19 | India reports 16,167 fresh cases and 15,549 recoveries in the last 24 hours.

Active cases 1,35,510
Daily positivity rate 6.14% pic.twitter.com/qHzvPun1FO

— ANI (@ANI) August 8, 2022
దేశంలో 16 వేలకు పైగా నమోదైన కరోనా కేసులు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *