Top Ad unit 728 × 90

UPDATES

ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 6వేల 960కు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే 62,938 శాంపిల్స్‌ను పరీక్షించగా 10,171 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. భారతీయ రైల్వే పండ్లు, కూరగాయలను రవాణా చేయడానికి ఇవాళ (ఆగస్టు 7) తన మొదటి 'కిసాన్ రైల్' సేవను ప్రారంభించబోతోంది. ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలాన్ని పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పదిగ్రాముల పసిడి ఏకంగా 57,008 రూపాయలకు పెరిగింది. మరోవైపు వెండి ధర కిలోకు 576 రూపాయలు భారమై 77,840 రూపాయలు పలికింది. లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 123 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

నల్లగొండలో నకిలీ విత్తనాల కేసులో వ్యవసాయశాఖ అధికారి...!

నల్లగొండలో నకిలీ విత్తనాల కేసులో వ్యవసాయశాఖ అధికారి...!

 

జిల్లా వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ఓ అధికారి నకిలీ పత్తి విత్తనాల దందా చేస్తూ పట్టుబడ్డాడు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ బృందం అధికారి ఇంట్లో తనిఖీలు చేయగా, నకిలీ విత్తనాల ప్యాకెట్లు భారీగా బయటపడ్డాయి. నకిలీ పత్తి విత్తనాల విక్రేతలకు, ఇద్దరు వ్యవసాయశాఖ అధికారులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు హైదరాబాద్‌ నుంచి వెళ్లిన టాస్క్‌ఫోర్స్‌ బృందం గుర్తించింది. అంతేకాదు, ఓ వ్యవసాయ శాఖ అధికారికి చెందిన ఇంట్లోనే నకిలీ పత్తి విత్తనాలు నిల్వ చేసినట్లు తేల్చింది. దీంతో ఆ అధికారి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 4,526 విత్తన ప్యాకెట్లు లభ్యమయ్యాయి. సంబంధిత కంపెనీల అధికారులతో మాట్లాడిన తర్వాత అవన్నీ నకిలీవని గుర్తించారు.

 

పైగా ఒక్కో రైతుకు 100 నుంచి 200 పత్తి విత్తన ప్యాకెట్లు అమ్మినట్లు రిజిస్టర్లు తనిఖీ చేస్తే తేలింది. హైదరాబాద్‌కు చెందిన మరో ఇద్దరు వ్యవసాయ అధికారుల సహకారంతో నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌ మండలానికి పంపగా, కొందరు తిరస్కరించడంతో స్టాక్‌ను తిరిగి నల్లగొండకు తీసుకొచ్చినట్లు ట్రాన్స్‌పోర్టు పేపర్లు దొరికాయి. దీంతో సదరు ఏజెన్సీ డీలర్‌తోపాటు దందాలో భాగస్వామ్యం ఉన్న డీలర్లు, ఇతరులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నల్లగొండ వ్యవసాయాధికారి సుమన్‌ రామన్‌, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వ్యవసాయ శాఖకు చెందిన ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.

నల్లగొండలో నకిలీ విత్తనాల కేసులో వ్యవసాయశాఖ అధికారి...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *