Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

మీ రాశిఫలాలు ఫిబ్రవరి 18 మంగళవారం 2020 చంద్ర‌బాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యే జ‌య‌సుధ ప్ర‌త్యేక భేటీ…! 100 కేజీల కేక్ ను కట్ చేయించిన నిమ్మకాయల వ్యాపారస్తులు, ఎందుకో తెలుసా…!   ప్రభుత్వ మద్యం దుకాణం నుండి బెల్ట్ దుకాణానికి మద్యం బాటిళ్లను సరఫరా చేస్తున్న…! ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాలు ఉధృతం: చలసాని శ్రీనివాస్ శివరాత్రిరోజు శివునికి ఇలా అభిషేకం చేస్తే ఎంతో మేలు...!    పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది...! పొలాల్లో దిగిన జెట్ విమానం…! నెయిల్ పాలిష్‌కు ఆర్డర్ ఇస్తే ఖాతా ఖాళీ చేసిన కేటుగాళ్లు…! ముత్య‌పుపందిరి వాహనంపై బ‌కాసుర‌వ‌ధ‌ అవతారంలో శ్రీకల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి   

ప్రియాంకకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

ప్రియాంకకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

ప్రియాంక చోప్రా నటించిన బాలీవుడ్‌ చిత్రం 'ది స్కై ఈజ్‌ పింక్‌' ట్రైలర్‌ నిన్న విడుదలయ్యింది. షోనాలీ బోస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫర్హాన్‌ అక్తర్‌, జైరా వసీం కీలక పాత్రలు పోషించారు. చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురై 15 ఏళ్లకే మంచి వక్తగా, కవయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ ట్రైలర్‌పై బాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తుండగా ఓ సన్నివేశంపై మహారాష్ట్ర పోలీసులు చేసిన కామెంట్‌ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ట్రైలర్‌లో ప్రియాంక, ఫర్హాన్‌ అక్తర్‌లు తమ కుమార్తె అనారోగ్యం గురించి చర్చిస్తూ వీలైనంత త్వరలోనే ఓ బ్యాంక్‌ను దోపిడి చేయాలి. అలాగైతేనే తనకు వైద్యం చేయించగల్గుతాం అని మాట్లాడుకుంటారు.

ఈ సన్నివేశంపై మహారాష్ట్ర పోలీసులు స్పందిస్తూ.. 'ప్రియాంక బ్యాంక్‌ దోపిడికి పాల్పడితే. ఐపీసీ సెక్షన్‌ 393 ప్రకారం ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు' అంటూ ట్విటర్‌లో 'స్కై ఈజ్‌ పింక్‌' టీమ్‌ను ట్యాగ్‌ చేశారు. ఈ ట్వీట్‌పై ప్రియాంక వెంటనే స్పందిస్తూ 'అరెరే రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోయాం కదా. అయితే ప్లాన్‌ బీని అమలు చేద్దాం' అంటూ రీట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ల సంభాషణ నెటిజనులను ఆకట్టుకుంటుంది. ఈ నెల 13న టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 'స్కై ఈజ్‌ పింక్‌' సినిమాను ప్రదర్శించనున్నారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

ప్రియాంకకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *