Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

మీ రాశిఫలాలు ఫిబ్రవరి 18 మంగళవారం 2020 చంద్ర‌బాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యే జ‌య‌సుధ ప్ర‌త్యేక భేటీ…! 100 కేజీల కేక్ ను కట్ చేయించిన నిమ్మకాయల వ్యాపారస్తులు, ఎందుకో తెలుసా…!   ప్రభుత్వ మద్యం దుకాణం నుండి బెల్ట్ దుకాణానికి మద్యం బాటిళ్లను సరఫరా చేస్తున్న…! ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాలు ఉధృతం: చలసాని శ్రీనివాస్ శివరాత్రిరోజు శివునికి ఇలా అభిషేకం చేస్తే ఎంతో మేలు...!    పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది...! పొలాల్లో దిగిన జెట్ విమానం…! నెయిల్ పాలిష్‌కు ఆర్డర్ ఇస్తే ఖాతా ఖాళీ చేసిన కేటుగాళ్లు…! ముత్య‌పుపందిరి వాహనంపై బ‌కాసుర‌వ‌ధ‌ అవతారంలో శ్రీకల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి   

బిగ్ బాస్ కు షాక్ ఇస్తున్న ప్రేక్షకులు...!

బిగ్ బాస్ కు షాక్ ఇస్తున్న ప్రేక్షకులు...!

ఏడు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ సీజన్ 2 లో కొన్ని విమర్శలు ఎదుర్కొన్న బిగ్ బాస్ ఈ సీజన్లో మాత్రం అలాంటి విమర్శలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. గత వారం ఎలిమినేషన్ కు శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, మహేశ్ విట్టా, రవి కృష్ణ, అలీ రేజా నామినేట్ కాగా అలీ రేజా బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ షోకు వచ్చే ముందు అలీ రేజా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా షోలోకి వచ్చాక మాత్రం అలీ రేజాకు మంచి గుర్తింపు వచ్చింది. నాగార్జున అలీ రేజా ఎలిమినేట్ అయ్యాడని చెప్పగానే బిగ్ బాస్ ఇంటి సభ్యులు కూడా ఒకింత షాక్ కు గురయ్యారు. బిగ్ బాస్ షో ప్రారంభమయ్యాక ఒక్కసారి కూడా ఎలిమినేషన్ కు నామినేట్ కాని అలీ రేజా ఏడవ వారంలో నామినేట్ అయి ఎలిమినేట్ అయ్యాడు.

బిగ్ బాస్ షో నుండి అలీ రేజా వెళ్ళిపోవటంతో ప్రేక్షకులు అలీ రేజా ఎలిమినేట్ అవుతాడని ఊహించలేదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ షోలో టాస్క్ లు అన్నీ కరెక్ట్ గా చేసే ఏకైక వ్యక్తి అలీ రేజా అని అలీ రేజా లేకుండా బిగ్ బాస్ షోపై కూడా ఆసక్తి ఉండదని కామెంట్లు చేస్తున్నారు. అలీకి ఉండే అగ్రెసివ్ నెస్ కారణంగానే ఎలిమినేట్ అయ్యాడని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని సందర్భాలలో అలీ రేజా టెంపర్ ను కంట్రోల్ చేసుకోలేకపోయినమాట వాస్తవమే. అలీ రేజా మరలా రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్ కు శిల్పా చక్రవర్తి, పునర్నవి భూపాళం, మహేశ్ విట్టా, హిమజ, శ్రీముఖి నామినేట్ అయ్యారు. మరి ఈ వారం బిగ్ బాస్ షో నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

బిగ్ బాస్ కు షాక్ ఇస్తున్న ప్రేక్షకులు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *