Top Ad unit 728 × 90

సస్పెన్స్‌... సైరెన్‌

సస్పెన్స్‌... సైరెన్‌

 

ప్రేమ పెళ్లి చేసుకొని చిన్న కుటుంబంతో అందమైన జీవితాన్ని గడుపుతూ అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు ఓ వ్యక్తి. అనుకోకుండా తను హంతకుడిగా మారి జైలుకి వెళ్లాడు.

 

14ఏళ్ల తర్వాత బయటికి వస్తాడు. ప్రాణాలు కాపాడే ఆ డ్రైవర్‌ ఎందుకు జైలుకి వెళ్తాడు? తిరిగొచ్చాక ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి? అన్న కథనంతో సాగిన 'సైరెన్‌' ట్రైలర్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.

 

జయం రవి, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా ఆంటోని భాగ్యరాజ్‌ రూపొందించిన చిత్రమది. పోలీసు పాత్రలో కీర్తి సురేశ్‌ అలరించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ క్రైమ్‌ యాక్షన్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ట్రైలర్‌ చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది. మునుపెన్నడూ చూడని విధంగా కీర్తి కనిపిస్తూ సందడి చేయనుంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.

 

సస్పెన్స్‌... సైరెన్‌ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *