Top Ad unit 728 × 90

బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ శ్రీముఖిపై ఆసక్తికర కామెంట్స్...!

బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ శ్రీముఖిపై ఆసక్తికర కామెంట్స్...!

బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా అవతరించిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనను గెలిపించిన ఫ్యాన్స్ కోసం ఈ నెల 29న మ్యూజికల్ లైవ్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించి ఈ కన్సర్ట్‌కి సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన ఫైనలిస్ట్ శ్రీముఖిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

నా లైవ్ కాన్సర్ట్‌కి శ్రీముఖిని ఇన్వైట్ చేశారా? అని మీడియా మిత్రులు నన్ను ఖతర్నాక్ ప్రశ్న వేశారు. దీనిపై నేను మాట్లాడితే పెద్ద కాంట్రవర్శి అవుతుంది. అయినా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లలో భాగంగా శ్రీముఖితో నాకు విభేదాలు వచ్చిన మాట వాస్తవం. గేమ్ స్ట్రాటజీ‌లో భాగంగా ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. నేను ఫినాలే స్టేజ్ మీద కూడా చెప్పా. విభేదాలు వస్తాయి పోతాయి అని అన్నీ పక్కనపెట్టేసి ఆమెకు ఓ హగ్‌కూడా ఇచ్చా.

 

బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తరువాత సక్సెస్‌ను ఎంజాయ్ చేయడానికి శ్రీముఖి మాల్దీవులకు పోయింది. సరిగ్గా రెండు రోజుల క్రితం ఆమె కొత్త నంబర్‌కి కాల్ చేశా. ఆమె ఫ్రెండ్ లిఫ్ట్ చేసింది. నేను రాహుల్ అనగానే, కొంచెం షాక్ అయ్యి, వీడెందుకు చేశాడని ఫోన్ కట్ చేశారు. మళ్లీ కాల్ చేసి నేను రాహుల్ సిప్లిగంజ్ని,  శ్రీముఖిని కాన్సర్ట్‌కి ఇన్వైట్ చేద్దాం అని ఫోన్ చేశాను అంటే, ఆమె లేదు ఫొటో షూట్‌లో ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేశారు.

మనిషి అన్నతరువాత తప్పులు చేస్తుంటారు. తప్పు జరిగినప్పుడు మనం వాటిని ఎలా సరిదిద్దుకోవాలి. నేను బిగ్ బాస్ హౌస్‌లో ఇదే పాయింట్ రేస్ చేశా. హౌస్‌లో తప్పులు నేను కూడా చేశా. ఇంట్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ చేశారు. తప్పులు చేసి ఎలా ఉండాలనేది నేను తెలుసుకున్నా. అదే నా మేజర్ విన్నింగ్ పాయింట్.

నేను శ్రీముఖిని నా కన్సర్ట్‌కి పిలుద్దామని కాల్ చేశాను. ఆమె ఫొటో షూట్‌లతో బిజీగా ఉంది. ఆమెకు ఉన్న బిజీ షెడ్యూల్ వద్ద మళ్లీ తిరిగి కాల్ చేయడం మరిచిపోయి ఉండవచ్చు. బిగ్ బాస్ నుండి బయటకు రాగానే వరుస ఆఫర్స్ మీద పడుతున్నాయి. ఏదైనా జరిగిఉండవచ్చు.

29న జరిగే లైవ్ కన్సర్ట్‌కి మా PVVR (పునర్నవి, వరుణ్, వితికా, రాహుల్) గ్యాంగ్ పక్కాగా ఉంటుంది. మిగిలిన హౌస్ మేట్స్‌కి కూడా చెప్తా. వాళ్లు వస్తారా? రారా... అనేది వాళ్ల ఇష్టం. నేను బయటకు వచ్చిన తరువాత పరిస్థితి వేరేలా ఉంది. హౌస్‌లో జరిగిన విషయాలను చాలామంది గుర్తు పెట్టుకుని చిన్న చిన్న మిస్ అండర్ స్టాడింగ్స్ వచ్చాయి.

ఈ కన్సర్ట్‌లో పున్నూ నేను స్పెషల్ సాంగ్‌కి ప్లాన్ చేస్తున్నాం. ఆమె లేకుండా కన్సర్ట్ చేస్తే మా చిచ్చాలు కొట్టేలా ఉన్నారు. మా ఇద్దరి కెమిస్ట్రీ జబర్దస్త్‌గా రీచ్ అయ్యిందట. ఎక్కడకు పోయినా... రాహుల్, పునర్నవి మధ్య ఏం ఉందని అడుగుతున్నారు. పున్నూతో లవ్, డేట్‌ గురించే చర్చ. ఆ క్యూట్ కెమిస్ట్రీని మేం సాంగ్‌ రూపంలో ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం.

 

బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ శ్రీముఖిపై ఆసక్తికర కామెంట్స్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *