దేవరను చంపేది ఎవరు...! పార్ట్ -2 లో ఉన్న ట్విస్ట్ ఏమిటి...?
దేవరను చంపేది ఎవరు...! పార్ట్ -2 లో ఉన్న ట్విస్ట్ ఏమిటి...?
దేవర సినిమా థియేటర్స్ లో దున్నేస్తుంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు కాలర్ ఎగరేస్తున్నారు. అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు థియేటర్స్ మోత మోగినట్లు... బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రికార్డ్స్ మోత మోగిపోతుంది. ఇలా ఒకటా రెండా దేవర గురించి ఎంత చెప్పినా తక్కువే. యంగ్ టైగర్ వసూళ్ల వేట బ్రేక్స్ లేకుండా హై స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇప్పట్లో అయితే ఈ వేట ఆగేలా కనిపించడం లేదు. తారక్ బాక్స్ ఆఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొడతాడా లేదా అనేది.. సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్ లా ఉండబోతుంది. సో థియేట్రికల్ రన్ అయ్యేవరకు ఆ లెక్కలు తేలవు. అలాగే దేవర పార్ట్-2 రిలీజ్ అయ్యేవరకు సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్ రివీల్ అవ్వదు. కానీ ఆ సస్పెన్స్ ఎలిమెంట్ గురించి మాత్రం ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ముందు నుంచి మూవీలో బాబీ డియోల్ ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడనే టాక్ ఉంది. కానీ సినిమాలో మాత్రం ఎక్కడా ఈ క్యారెక్టర్ కనిపించలేదు. ఆ సస్పెన్స్ కు బాబీ డియోల్ కు ఏదైనా సంబంధం ఉందేమో అని అందరికి ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
Kubera ashta lakshmi mantra with Lyrics | కుబేర అష్టలక్ష్మి మంత్రం
దేవర సినిమా ఆల్రెడీ చూసి ఉంటే, ఈ మ్యాటర్ అందరికి అర్ధమౌతుంది. ఒకవేళ చూడకపోతే ఇది తెలుసుకున్న తరువాత కచ్చితంగా చూడాలన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. దేవరలో తారక్, వర, దేవర అనే తండ్రి కొడుకుల పాత్రలను చేశాడు. అందులో తండ్రి క్యారెక్టర్ లో దేవర థియేటర్స్ లో అందరికి గూస్బంప్స్ తెప్పించాడు. భయం అంటే ఏంటో తెలియాలంటే నిజంగానే దేవర కథ చూడాలి అనే ఫీలింగ్ పక్కా వస్తుంది. మరో వైపు దేవర కొడుకు మాత్రం కాస్త భయస్తుడు. ఇక సినిమా చూసినా వారందరికి, దేవర ఒక్కసారిగా అందరికి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు ? దేవర కొడుకు భయస్తుడిగా ఎలా మారాడు? భయమంటే ఏంటో తెలియని దేవరను చంపింది ఎవరు ? అసలు దేవర నిజంగానే చనిపోయాడా ? భయానికి వణుకు పుట్టించే దేవరను కొడుకే చంపేస్తాడా? ఇలా రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే . అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే.. క్లైమాక్స్ లో దేవరను వర చంపినట్లుగా చూపిస్తారు. అయితే దేవరను చంపాలనుకునేది మాత్రం భైర, కానీ ఆ సీన్ లో భైరను చూపించరు. సో అసలు దేవరను ఎవరు చంపారు.. ఎందుకు చంపారు అనేది ట్విస్ట్. ఇప్పుడు ఈ ట్విస్ట్ కు బాబీ డియోల్ కు ఎదో లింక్ ఉన్నట్లు తెలుస్తుంది.
ఎందుకంటే దేవర సినిమాలో బాబీ డియోల్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని టాక్ వచ్చింది. దానికి సంబంధించిన షూటింగ్స్ కూడా జరిగాయి. ఇది అందరికి తెలిసిన సంగతే. కానీ సినిమాలో మాత్రం ఈ క్యారెక్టర్ ఎక్కడా కనిపించలేదు. కనీసం క్లైమాక్స్ లో కూడా ఈ క్యారెక్టర్ ను చూపించరు. సో చివరిలో దేవరను చంపేది బాబీ డియోల్ అయిండొచ్చు. ఎందుకంటే అందరికి భయం పుట్టించే దేవరను చంపాలంటే అంతకంటే బలమైన వాడు లేదా వాడు రాక్షసుడు అయ్యుండాలి. అలాంటి క్యారెక్టర్ కు బాబీ డియోల్ సరిగ్గా సరిపోతాడు. సో బాబీ డియోల్ పాత్ర సెకండ్ హాఫ్ కు హైలెట్ అయ్యే అవకాశం ఉంది. ఇదే క్యారెక్టర్ సినిమాలో మోస్ట్ సస్పెన్స్ ఎలిమెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇంకా దేవర చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. అప్పుడే పార్ట్-2 లో కిక్ ఇచ్చే ఎలిమెంట్స్ ను ఎంజాయ్ చేయొచ్చు.