Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

ఉప్పు గురించి సంపూర్ణ వివరణ…! ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 15 జూలై 2020 3 నెలల లాక్ డౌన్ తర్వాత కొత్త ఉత్సాహంతో రేడివుతున్న బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్‌.. ఏపీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు చర్యలు ప్రారంబించిన  ఉన్నతాధికారులు.. కరోన వైరసును ఎదుర్కునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు  చేస్తున్న  రైల్వే శాఖ అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై  వాయుద వేసిన  ఏపీ హైకోర్టు. కరోనాతో మృతిచెందితే అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి రూ 15వేలు ఇవ్వాలనన్న ఏపి ముఖ్యమంత్రి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాము రేపుటి నుంచి మూసివేయునున్నర..? బీహార్‌లో సంపూర్ణ లాక్ డౌన్…! ఆకాశంలో అరుదైన దృశ్యం, భారత్‌కి దగ్గరగా తోకచుక్క...!   

జబర్దస్త్ షోకు మరొక భారీ షాక్... ఆమె కూడా...!

జబర్దస్త్ షోకు మరొక భారీ షాక్... ఆమె కూడా...! 

ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై ప్రసారం అవుతున్న మంచి క్రేజీ షోల్లో, ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో కూడా ఒకటి అనే చెప్పాలి. ప్రతి వారం కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే స్కిట్స్ తో విపరీతమైన ప్రేక్షకాభిమానం మరియు అద్భుతమైన రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న ఈ షోకు కొన్నేళ్ల నుండి జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు సడన్ గా వీడ్కోలు చెప్పడంతో ఆ షో యాజమాన్యం కొంత ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

 

అయితే నాగబాబుకు మరియు జబర్దస్త్ యాజమాన్యానికి మధ్య జరిగిన కొద్దిపాటి వివాదమే ఆయన షో నుండి నిష్క్రమించడానికి కారణం అంటూ కొద్దిరోజులుగా వార్తలు వచ్చినప్పటికీ, అటువంటిది ఏమి లేదని, జబర్దస్త్ షోలో ఏడేళ్ల తన జర్నీ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, అయితే కొంత రిలీఫ్ కోసం తాను వేరే ఛానల్ లో మరొక షోకి జడ్జీగా వ్యవహరిస్తున్నట్లు నాగబాబు తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. 

 

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ, నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ షో నుండి నాగబాబుతో పాటు యాంకర్ అనసూయ కూడా షో నుండి బయటకు వెళ్ళిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వేరే ఛానల్ లో ఒక ప్రోగ్రాం కు నాగబాబుతో సహా జడ్జిగా వ్యవహరించబోతోందట అనసూయ. అయితే ఆమె కూడా కావాలనే షో నుండి తప్పుకుంది తప్పించి, ఎటువంటి వివాదాలు లేవని కూడా వార్తలు వస్తున్నాయి.

 

కాగా ఇప్పటివరకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎంతో విజయవంతంగా కొనసాగిన ఈ షో, ఇకపై నాగబాబు, అనసూయలు లేకుండా ఎంతవరకు సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుంది అనే దానిపై మాత్రం పలువురు ప్రేక్షకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది...!

 

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి అద్బుతమైన పాట మీ కోసం...!

స్వామి... నీ లీల తెలిసితే మోక్షమే...! ఈ పాట వినండి

ఈ పాట ఒక్కసారి వింటే 1000 సార్లు తిరుమల వెల్లివచ్చినంత పుణ్యం కలుగుతుంది...!

అన్నమాచార్య సంకీర్తన | శ్రీ వేంకటేశ్వర స్వామి అద్బుతమైన పాట...!

 

జబర్దస్త్ షోకు మరొక భారీ షాక్... ఆమె కూడా...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *