Top Ad unit 728 × 90

గురువును గౌరవించడంలో మనం ఆరో స్థానంలో ఉన్నాం...!

గురువును గౌరవించడంలో మనం ఆరో స్థానంలో ఉన్నాం...!

 

గురువును సాక్షాత్తూ పరబ్రహ్మగా భావించే దేశం మనది. గురువును తల్లిదండ్రుల కంటే ఎక్కువగా గౌరవించే దేశం మనది కానీ గురువులను గౌరవించే విషయంలో భారతదేశం ప్రపంచంలో ఆరోస్థానంలో ఉందట! బ్రిటన్కు చెందిన వార్కీ ఫౌండేషన్చేసిన అధ్యయనంలో వెల్లడైన వాస్తవం ఇది. దాదాపు 35 దేశాలలో నిర్వహించిన అధ్యయనంలో ఒక్కో దేశంలో వెయ్యిమందిని దీనిపై ప్రశ్నించారు అధ్యాపకులను మీరు ఎంతగా విశ్వసిస్తున్నారు? టీచర్లు మీలో స్ఫూర్తిని నింపుతున్నారా? మీకు బోధన చేసే టీచర్లు విజ్ఞానవంతులని భావిస్తున్నారా? వంటి ప్రశ్నలను అడిగి సమాధానాలను రాబట్టారు టీచర్లను తగిన గౌరవం ఇచ్చే దేశాలలో చైనా మొదటి స్థానంలో ఉందట. రెండో స్థానంలో ఘనా నిలిచింది సింగపూర్‌, కెనడా, మలేషియాలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి ఆరో స్థానంలో భారత్నిలిచింది చక్కటి సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర విద్యార్థులను సమ సమాజ నిర్మాతలుగా తీర్చిదిద్దేది వారే. అలాంటి ఉపాధ్యాయులను గౌరవించడం మన నైతిక బాధ్యత అంటున్నారు వార్కీ ఫౌండేషన్వ్యవస్థాపకుడు సన్నీ వార్కీ. విద్యారంగాన్ని చాలా దేశాలు చిన్నచూపు చూస్తున్నాయి రెండో స్థానంలో ఉన్న ఘనా ప్రభుత్వ తను చేస్తున్న మొత్తం వ్యయంలో 22.1 శాతం విద్యకే ఖర్చుపెడుతోంది అదే భారత ప్రభుత్వం విద్యకు కేటాయిస్తున్నది 14 శాతమే! విద్యావంతులున్న దేశం సుసంపన్నంగా మారుతుందనడంలో సందేహం లేదు.

 

గురువును గౌరవించడంలో మనం ఆరో స్థానంలో ఉన్నాం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *