Top Ad unit 728 × 90

ఎంబీఏలు యాభై

ఎంబీఏలు యాభై

విభిన్న రంగాల్లో స్పెషలైజేషన్లు

ఆధునిక అభివృద్ధికి అనుగుణంగా ఎంబీఏ రూపురేఖలు మార్చుకుంటోంది. రకరకాల ఐచ్ఛికాలతో కోర్సులు రూపొందుతున్నాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలు, ఆసక్తి, అభిరుచులను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులు కోర్సును ఎంచుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్‌ ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇంకా వివిధ మేనేజ్‌మెంట్‌ ప్రవేశపరీక్షలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంబీఏలోని వివిధ స్పెషలైజేషన్లపై అవగాహన ఏర్పరచుకుంటే తగిన నిర్ణయం తీసుకోడానికి వీలుంటుంది.

ఏడిగ్రీ చదివినా, ఏ రంగంలోకి వెళ్లాలనుకున్నా మేనేజ్‌మెంట్‌ కోర్సు నిచ్చెనలా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు మేనేజ్‌మెంట్‌ కోర్సులు (ఎంబీఏ) లేకపోవడంతో ఇంజినీరింగ్‌ చదివినవారినీ, ఏదైనా పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేసినవారినీ మేనేజర్లుగా నియమించేవారు. ఇప్పుడు మేనేజ్‌మెంట్‌ కోర్సులకు, సీట్లకు వివిధ రకాలైన స్పెషలైజేషన్లకు కొదవ లేదు. అయితే మేనేజ్‌మెంట్‌ కోర్సు చదవాలనుకునేవారిని వెంటాడే సందేహాల్లో మొదటిది- ఏ స్పెషలైజేషన్‌ తీసుకోవాలి అని!

మేనేజ్‌మెంట్‌ విద్యలో స్పెషలైజేషన్‌ అనేది ఎంబీఏ రెండో సంవత్సరంలో ఉంటుంది. కాబట్టి, మొదటి సంవత్సరానికి విద్యార్థులకు కొంత అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి, స్పెషలైజేషన్‌ను ఎంచుకోవడం అంత కష్టం కాదు. ఆసక్తినిబట్టి స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాలా? ఉద్యోగావకాశాలను బట్టి ఎంచుకోవాలా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. అభిరుచి, ఆసక్తులను బట్టి ఎంచుకుంటే బాగా రాణించే అవకాశం ఉంటుంది. దేన్ని ఎంచుకున్నప్పటికీ దానిపై ఉన్న ఆసక్తి, దాన్ని చదివేతీరు, ఆ రంగంపై ఉన్న అవగాహన, దానిలో వస్తున్న మార్పులపై నిశిత పరిశీలన వంటివి అభ్యర్థిని ముందు వరుసలో నిలబెడతాయి. ప్రస్తుతం విస్తరిస్తున్న మార్కెట్‌లో ప్రతి రంగానికీ అత్యంత ప్రతిభ ఉన్న నిపుణుల అవసరం ఎంతగానో ఉంది.

ఐసెట్‌ కౌన్సెలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లోని కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ చదవాలనుకునేవారు రాసే పరీక్ష- ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌). ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఈ పరీక్ష ముగిసి ఫలితాలు ప్రకటించారు. తెలంగాణలో మే 23, 24 తేదీల్లో నిర్వహించనున్నారు. అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ జూన్‌ చివరివారం, జులైల్లో ఉండవచ్చు. 
ఐసెట్‌ కౌన్సెలింగ్‌ మొదలయ్యేలోపు మార్కులు, ర్యాంకు అంచనా వేసుకుని సీటు రాగల కళాశాలల్లో ఏది మెరుగైందో తెలుసుకోవాలి. ఇందుకు ఇంటర్నెట్‌, సీనియర్‌ విద్యార్థుల సాయం తీసుకోవచ్చు. 
ఆ కళాశాలలు ఎన్ని సంవత్సరాలక్రితం స్థాపించారో చూడాలి. ఫ్యాకల్టీ సభ్యుల, కళాశాల ప్లేస్‌మెంట్‌ వివరాలను తెలుసుకోవడం మంచిది. బోధన పటిష్ఠంగా ఉందో లేదో గమనించాలి. ఆ కాలేజీల్లో ఇప్పటికే చదువుతున్న విద్యార్థుల అభిప్రాయాలను తీసుకుంటే ప్రయోజనకరం. 
ఎంబీఏలో రెండో సంవత్సరంలో అభ్యర్థులు స్పెషలైజేషన్లను ఎంచుకోవాల్సివుంటుంది. మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌ మొదలైనవాటిలో ఆసక్తి ఉన్న ఆప్షనల్‌ అక్కడుందో లేదో చూసుకోవాలి. లేకపోతే అక్కడున్న ఐచ్ఛికంతోనే రెండో ఏడాది సరిపెట్టుకోవాల్సివుంటుంది. రెండు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారా ర్యాంకు, క్యాటగిరి, జండర్‌, స్థానికతల ఆధారంగా కళాశాలలను కేటాయిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌: పరీక్ష హాల్‌టికెట్‌తో పాటు ర్యాంకు కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్‌ మార్కుల మెమో, ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌ను కౌన్సెలింగ్‌ సహాయకేంద్రాలకు తీసుకువెళ్లాలి. పదో తరగతి మెమో, ఆదాయ సర్టిఫికెట్‌ కూడా అవసరం. రిజర్వేషన్‌ అభ్యర్థులు నిర్దేశిత ప్రభుత్వ అధికారులు జారీ చేసిన కులధ్రువీకరణ పత్రాన్నీ, ఆధార్‌ కార్డునూ వెంట తీసుకువెళ్లాలి. డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తర్వాత కళాశాలల వివరాల ఆప్షన్లను ఆన్‌లైన్లో ఎంట్రీ చేయాల్సివుంటుంది.

తెలంగాణ: ఐసెట్‌ పరీక్ష జరిగి ఫలితాలు ప్రకటించాక కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది మొదట డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు సహాయకేంద్రాల్లో స్వయంగా హాజరుకావాల్సివుంటుంది. ఆన్‌లైన్లో క్యాండిడేట్స్‌ రిజిస్ట్రేషన్‌ అనే కాలమ్‌లోకి వెళ్లి పాస్‌వర్డ్‌ జనరేట్‌ చేసుకోవాలి. తర్వాత కళాశాలల వివరాలు నింపాల్సివుంటుంది.

ఎంచుకోడానికి ఎన్నో...

ప్రస్తుతం దేశంలో దాదాపుగా 50 రకాల ఎంబీఏలు అందుబాటులో ఉన్నాయి. అందులో జనరల్‌ ఎంబీఏ కోర్సు ఎప్పటినుంచో అందుబాటులో ఉంది. ఈమధ్య కాలంలో ఎంబీఏలో ప్రత్యేకమైన కోర్సులైన హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, టెలికం మేనేజ్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌, రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌, బ్యాంకింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌ వంటివి వచ్చాయి.

ఇంకా టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌, బ్యాంకింగ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, సప్లయి చైన్‌ మేనేజ్‌మెంట్‌, రూరల్‌ మేనేజ్‌మెంట్‌, టెక్స్‌టైల్‌ మేనేజ్‌మెంట్‌, స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, ఎక్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, డెయిరీ మేనేజ్‌మెంట్‌, కోఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌, నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌, లగ్జరీ మేనేజ్‌మెంట్‌, ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌, ఇండస్ట్రియల్‌ మేనేజ్‌మెంట్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, బయోటెక్నాలజీ మేనేజ్‌మెంట్‌, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌, లీగల్‌ మేనేజ్‌మెంట్‌, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌ ఉన్నాయి. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు ప్రాచుర్యం పొందినవే. కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌, డిజైన్‌ మేనేజ్‌మెంట్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, షిప్పింగ్‌ అండ్‌ పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఐటీ మేనేజ్‌మెంట్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ లాంటివీ వచ్చాయి. ఈ కోర్సులు జనరల్‌ ఎంబీఏలో స్పెషలైజేషన్లుగా కూడా ఉన్నాయి.

కేస్‌ స్టడీ పద్ధతి

ఎంబీఏను కేస్‌స్టడీ పద్ధతిలో చదవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని ప్రశ్నలు- సమాధానాలు పద్ధతిలో చదవటం ఫలితాన్నివ్వదు. దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలు ఈ కోర్సును కేస్‌స్టడీ పద్దతిలోనే బోధిస్తూ విద్యార్థులకు మేనేజ్‌మెంట్‌ రంగంలో చాలా మెలకువలను నేర్పుతున్నాయి. ఎంబీఏను అభ్యసిస్తున్న, చదవాలనుకుంటున్నవారు కోర్సులో ఉన్న సిలబస్‌కే పరిమితం కాకూడదు. సామాజికంగా ఆయా రంగాల్లో వస్తున్న మార్పులను పరిశోధనా వ్యాసాలు, వార్తాపత్రికలు, వ్యాపార పత్రికలు, టీవీ ఛానళ్ల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. కీలకమైన ప్రాజెక్ట్‌ వర్కును యాంత్రికంగా కాకుండా నిజాయతీగా చేయాలి. ఎంచుకున్న సమస్యకు పరిష్కారాలను కనుక్కునే దిశగా ప్రయత్నించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఎంబీఏను కోర్సులా కాకుండా ఒక శిక్షణలా భావించాలి. మెలకువలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్‌ ద్వారా సీట్లు సంపాదించి వివిధ కళాశాలల్లో ఎంబీఏను చదువుతున్నారు. వారు తెలుసుకోవాల్సింది- ఎంబీఏ చేసినంత మాత్రాన ఉద్యోగావకాశాలు తేలిగ్గా రావని! సిలబస్‌తోపాటుగా వీలైనన్ని ఆన్‌లైన్‌ కోర్సులు చేయాలి.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

ఎంబీఏలు యాభై Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *