Top Ad unit 728 × 90

కెటమీన్ , మద్యపాన వ్యసనం నుంచి ఈ మందు బయట పడేస్తుందా...!

కెటమీన్ , మద్యపాన వ్యసనం నుంచి ఈ మందు బయట పడేస్తుందా...!

భారీగా మద్యం తాగేవారు మోతాదును తగ్గించటానికి ఒక కెటమీన్ డోస్ సాయపడగలదని యూనివర్సిటీ కాలేజ్ లండన్ నిర్వహించిన ఒక ప్రయోగాత్మక పరీక్ష సూచిస్తోంది.

మద్యప్రియులు తాము ఎందుకు మద్యం తాగాలని కోరుకుంటున్నామనే జ్ఞాపకాలకు ఆటంకం కలిగించటానికి ఈ ఉపశమన ఔషధం (నిద్రపుచ్చే ఔషధం) ఉపయోగించినపుడు, వారు మామూలుగా తాగే మద్యం కన్నా తక్కువ తాగటమే కాదు వారిలో మద్యం తాగాలనే కోరిక కూడా తగ్గిపోయిందని తొమ్మిది నెలల పాటు చేసిన ప్రయోగంలో గుర్తించారు.

మద్యపానం, ఇతర వ్యసనాలకు చికిత్స చేయటంలో కెటమీన్ సాయపడవచ్చని ఈ పరిశోధకులు అంటున్నారు.

తాజా ప్రయోగంలో గుర్తించిన విషయాలను బట్టి దీనిపై మరింత లోతుగా పరిశోధన చేయవచ్చునని నిపుణులు పేర్కొన్నారు.

ఇంతకీ ఈ కెటమీన్ ఏమిటి?

బ్రిటన్ జాతీయ ఆరోగ్య ప్రణాళికలో కెటమీన్‌ను మత్తుమందుగా, నిద్రపుచ్చే మందుగా, నొప్పి నివారిణిగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

దీనిని జంతువుల మీద కూడా ఉపయోగిస్తుంటారు.

ఈ ఔషధానికి భ్రమలు కలిగించే శక్తి కూడా ఉండటం వల్ల దీనిని 'పార్టీ డ్రగ్' అని కూడా పిలుస్తుంటారు.

కానీ, దీనిని ఈ రకంగా ఉపయోగించినట్లయితే శరీరానికి తీవ్ర హాని కలిగించటమే కాదు ప్రాణాంతకం కూడా కావచ్చు.

కెటమీన్‌ను క్లాస్-బి ఔషధంగా ప్రభుత్వం వర్గీకరించింది. అంటే.. దీనిని తీసుకోవటం, దగ్గర ఉంచుకోవటం, తయారు చేయటం, విక్రయించటం చట్ట వ్యతిరేకం.

సరదా కోసం ఉపయోగిస్తే ఉండే ప్రమాదాలు...

 • తీవ్రమైన మూత్రాశయ సమస్యలు
 • అనారోగ్యంగా అనిపించటం
 • అయోమయం
 • జ్ఞాపకశక్తి సమస్యలు
 • కండరాల పక్షవాతం
 • భ్రాంతి
 • కుంగుబాటు
 • బాధాకరమైన జ్ఞాపకాలు
 • ఈ అధ్యయనంలో ఏం గుర్తించారు...

 • వారానికి 30 పింట్లు (సిఫారసు చేసిన మోతాదు కన్నా ఐదు రెట్లు అధికం), అంతకన్నా ఎక్కువ మోతాదులో బీరు తాగే 55 మంది పురుషులు, 35 మంది మహిళల మీద ఈ అధ్యయనం నిర్వహించారు. అయితే, వీరికి మద్యపానం వ్యసనంగా మారిందని ఇప్పటికే గుర్తించటం కానీ, చికిత్స అందించటం కానీ ఏమీ జరగ లేదు.

  మొదట వీరికి బీరు, ఇతర మద్యపానీయాల ఫొటోలు చూపించి మద్యం తాగాలన్న కోరిక ఎంత తీవ్రంగా ఉందో, అది తాగితే ఎంత ఆనందం కలుగుతుందో రేటింగ్ ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత వారికి బీరు ఇచ్చారు.

  అనంతరం వారిని మూడు బృందాలుగా విభజించారు.

 • మొదటి ప్రక్రియను మళ్లీ అనుసరించారు. అయితే ఈసారి బీరుకు బదులు సెలైన్ ద్వారా స్వల్ప మోతాదులో కెటమీన్ అందించారు.
 • మొదటి ప్రక్రియను మళ్లీ అనుసరించారు. అయితే బీరుకు బదులు సెలైన్ ద్వారా ప్లాసిబో (ఔషధం కాని మామూలు పదార్థం) అందించారు.
 • మొదటి ప్రక్రియను పునరావృతం చేయకుండా.. సెలైన్ ద్వారా స్వల్ప మోతాదులో కెటమీన్ అందించారు.
 • తర్వాతి తొమ్మిది నెలల్లో ఈ మూడు బృందాలూ తాము తాగే మద్యం మోతాదును తగ్గించగలిగాయి.

  కానీ, మూడు బృందాల్లో మొదటి బృందం అత్యధికంగా మెరుగుపడింది.

 • తాగే మద్యం పరిమాణం సగానికి తగ్గిపోయింది
 • మద్యం తాగే రోజులు కూడా తగ్గిపోయాయి
 • చిన్న బీరు అందించినపుడు దానిని తాగాలన్న కాంక్ష తక్కువగా ఉండటంతో పాటు, దానిని ఆస్వాదించటం తగ్గిపోయింది
 • నిపుణులు ఏం చెప్తున్నారు?
 • ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన డాక్టర్ రవి దాస్ యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో సైకోఫార్మకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ''చాలా అర్థవంతమైన, అందుబాటులో ఉన్న విధానానికి సంబంధించిన మొదటి ప్రదర్శన ఇది'' అని ఆయన చెప్పారు.

  ''వ్యసనపరులకు అందించే చికిత్సను మెరుగుపరచాలని మేం కోరుకుంటున్నాం. కాబట్టి ఇదే పరీక్షను ఇప్పుడు పూర్తిస్థాయి వైద్యపరమైన ప్రయోగంగా చేయాల్సిన అవసరం ఉంది'' అని పేర్కొన్నారు.

  ఈ అధ్యయనంలో గుర్తించిన విషయాలు ఆశాజనకంగా ఉన్నాయని.. మరింతగా పరిశోధన చేయగల విలువ వీటికి ఉందని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్‌లో సైకాలజీ ప్రొఫెసర్ మాట్ ఫీల్డ్ అభిప్రాయపడ్డారు.

  కానీ, ''మరింత ఎక్కువ మంది మీద తదుపరి ప్రయోగాలు చేయటానికి కెటమీన్‌ను ఉపయోగించటం వల్ల జ్ఞాపకాలను తిరగరాయటం ద్వారా మద్యపానం విషయంలో దీర్ఘ కాలం కొనసాగే అనూహ్య తగ్గుదల ఉందన్న వాదనలను బలంగా సమర్థించుకోవలసి ఉంటుంది'' అని చెప్పారు.

  ''కెటమీన్ అనేది ఒక వ్యసనకారక పదార్థం. మూత్రాశయానికి హాని చేయగలదు. ప్రమాదాల ముప్పూ ఉంది. కాబట్టి.. వ్యసనానికి లోబడే ప్రవర్తన గల బృందాలలో దీనిని ఉపయోగించే విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది'' అని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సిటర్‌లో సైకోఫార్మకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సీలియా మోర్గన్ పేర్కొన్నారు.

  ''అయితే, కెటమీన్ ఉపయోగంలో సైన్సును ముందుకు తీసుకెళ్లటానికి ఇది చాలా ముఖ్యమైన కృషి'' అని ఆమె వ్యాఖ్యానించారు.

 • ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…! 

 • పొగ త్రాగకుండా ఉండలేక పోతున్నారా...!

 • మధ్యానికి బానిస అయిన వారిని మాములు మనిషిని చేయడం ఎలా...!

  గుట్కాలు తినే అలవాటు నుండి బయటపడలేకపోతున్నారా...!

     

 •  

   


   
కెటమీన్ , మద్యపాన వ్యసనం నుంచి ఈ మందు బయట పడేస్తుందా...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *