Top Ad unit 728 × 90

విజయదశమి విశిష్టత...!

విజయదశమి విశిష్టత...!

        "యత్రయోగేశ్వర: కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధర:
        తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా  నీతిర్మతిర్మమ"


ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడుండునో... మరియు ఎక్కడైతే ధనుర్ధారియైన పార్ధుడు "అర్జునుడు" ఉండునో... అక్కడే విజయం ఉంటుంది, లక్ష్మీ (సంపద) లతో కళ్యాణముండును. అంతేగాక శాశ్వతమైన నీతి ఉంటుంది, అని వ్యాస మహర్షి  భగవద్గీతలో చివరి శ్లోకం ద్వారా కృష్ణుని నోటిద్వార పలికించెను.

యోగేశ్వర కృష్ణుడనగా ఈశ్వర కృప అని, ధనుర్ధారి అయిన అర్జునుడనగా మానవ కృషి అని భావం. ఈ ఇద్దరి కలయిక వలన అసంభవమైన కార్యం ఏదైనా ఉంటుందా... ఉండదు. కష్టే ఫలే అన్నారు పెద్దలు. మానవ కృషికి భగవంతుని అనుగ్రహం తోడైతే విజయ శంఖనాదమై వినబడుతుంది. 

దసరా ఉత్సవం అనగా శక్తి మరియు శక్తి యొక్క సమన్వయాన్ని తెలియజేయు ఉత్సవం. నవరాత్రులలోని తొమ్మిది రోజులు నిష్టగా లోకమాత జగదాంబ అమ్మవారిని పూజించుకుని అమ్మవారి అనుగ్రహంతో శక్తి శాలిగా మారిన మానవుడు  విజయం పొందుటకు మనిషి యొక్క మనస్సు ఉరకలు వేస్తూ కనిపిస్తుంది. ఇదే దృష్టిచే చూస్తే దసరా ఉత్సవం అనగా విజయం కొరకు ప్రయాణం చేసే ఉత్సవం దసరా.

భారతీయులది వీరత్వాన్ని పూజించే సంస్కృతి. శౌర్యమును ఉపాసించునది. వ్యకి మరియు సమాజం యొక్క రక్తంలో మానవత్వం, వీరత్వం ఉన్నదనీ దానిని నిరూపించుకోవాలనే ఉద్దేశ్యముచే దసరా ఉత్సవం ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా ఈ పండగ అంటే సమాజంలో ఉన్న దీనత, హీనత, నిస్సహాయత మరియు భోగ భావములను సంహరించుటకై  అందరూ నడుముకట్టి నిలబడాల్సిన దినం.

ఈ రోజు ధనం మరియు వైభవములను పంచుకొని ఆనందాన్ని అనుభవించే దినం. మనిషికి ఉన్న బాహ్య శత్రువులతో పాటు తన శరీరంలో ఉన్న షడ్రిపులపై విజయం సాధించుటకు కృత నిశ్చయం అవ్వాల్సి రోజు ఈ  దసరా పండగ. ఆశ్వీయుజ శుద్ధ దశమి శ్రవణా నక్షత్రం తో కలిసిన  "విజయదశమి" రోజున సాయంకాలం సమయంలో శత్రు వినాశనం కొరకు, విజయప్రాప్తి కొరకు జమ్మిచెట్టు వద్ద అపరాజితా దేవిని, శమి వృక్షమును విజయపత్రము (ఆకులు ) లను పూజించాలి.

శమీ శమయతే పాపం శమిశత్రువినాశనీI

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం II

అంటూ... జమ్మి చెట్టు నమస్కరించి ఆకులకు కోసుకుని మార్గ మధ్యలో దైవ దర్శనం చేసుకుని నేరుగా ఇంటికి వచ్చి ఆ జమ్మిచేట్టుకు కోసుకువచ్చిన జమ్మిఆకులను దేవుని వద్దపెట్టి నమస్కరించుకుని ఆతర్వాత మొదట కన్న తలిదండ్రులకు ఆ జమ్మిఆకులను ఇచ్చి పాద నమస్కారం చేసుకుని వారి ఆశీస్సులు పొందాలి. ఆ తరవాత ఇంట్లో ఉన్న ఇతర పెద్దలకు, కుటుంబ సభ్యలకు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసి, ఆ తర్వాతనే ఇరుగు పొరుగు, బయట వారికి బందు, మిత్ర, ధనిక, పేద అనే తారతమ్యత లేకుండా అందరికి శుభాకాంక్షలు తెలియజేయాలి.

దసరా అంటేనే... ఆత్మీయతను,ఉదారతను వ్యకతపరిచే గొప్ప పండగ పేదవారికి, అనాధలకు, అవిటివారికి శక్తి కొలది ధన, వస్తు, వస్త్ర, ఆహార రూపంలో ఎదో ఒక రూపంలో దానం ధర్మం చేయాలి. అన్ని వర్గాల వారితో ప్రేమ పూర్వకంగా ఆప్యాయయతలను పంచాలి, ఆదరించాలి. అప్పుడే నిజమైన దసరా పండగ జరుపుకున్నటుగా భావించాలి.

వివరణ: డా.యంఎన్. చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్ - ఫోన్:  9440611151

ముఖ్య గమనిక: వార్తలు, కథనాలు, భక్తి సమాచారం వ్రాయాలనుకున్తున్నారా...? మీ వివరాలను info@pslvtv.com OR pslvtv@gmail.com మెయిల్ చేయగలరు.

విజయదశమి విశిష్టత...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *