32 దంతాలతో పుట్టిన శిశువు, వైరల్ అవుతున్న వీడియో ఇదే...!
32 దంతాలతో పుట్టిన శిశువు, వైరల్ అవుతున్న వీడియో ఇదే...!
సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు దంతాలు ఉండవు. రెండు నుండి మూడు సంవత్సరాల వయస్సులో వారికి దంతాలు రావడం ప్రారంభమవుతుంది. ఇక పూర్తిగా దంతాలు రాడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.
కానీ శిశువు పుట్టినప్పుడే దంతాలు ఉంటే... అదికూడా 32 దంతాలు ఉంటే ఏంటి షాక్ అవుతున్నారా కానీ ఇది నిజంగానే జరిగింది.
నిజానికి ఇలాంటి ఘటనలు జరగడం చాలా అరుదు... వేలల్లో ఒకరికి మాత్రమే పుట్టుకతో దంతాలు ఉంటాయి. తాజాగా ఓ మహిళ విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. ఇందులో సదరు మహిళ తన నవజాత శిశువు పరిస్థితిని ప్రస్తావించింది. దీనిపై అందరూ పలు రకాలుగా స్పందిస్తుననారు. కొందరు ఇది అద్బుతం అంటుంటే... మరికొందరు విచారం వ్యక్తం చేస్తున్నారు.
తన కూతురు 32 దంతాలతో పుట్టిందని ఆ మహిళ స్లైడ్ షోలో రాసుకొచ్చింది. ఈ పరిస్థితిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఆమె ఇదంతా చేసింది. ఈ వీడియోపై చాలా మంది కామెంట్లు కూడా చేస్తున్నారు. ఆ అమ్మాయి చిరునవ్వు కొందరికి బాగా నచ్చితే, మరికొందరికి ఆ చిన్నారి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియోలో చాలా మంది ఆ తల్లిపై సానుభూతిని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఒక యూజర్ దీనిని స్టీవ్ హార్వే కండిషన్ అని అన్నాడు. ఈ వీడియోని నికా దివా అనే అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇప్పటివరకు దీనిని 2.96 కోట్ల మంది చూశారు.