Top Ad unit 728 × 90

ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాలు ఉధృతం: చలసాని శ్రీనివాస్

ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాలు ఉధృతం: చలసాని శ్రీనివాస్

 

  • విభజన హామీలను అమలుచేయాలి
  • రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి
  • సమాంతరకాలవ నిర్మించాలి

 

PSLV TV అనంతపురము: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏపి విద్యార్థి, యువజన జెఏసి రాష్ట్ర అధ్యక్షులు సాకే నరేష్ తో కలిసి మాసినేని గ్రాండ్ హోటల్ లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హోదాపై నిర్ధిష్టంగా హామీ ఇచ్చాకే కేంద్రానికి వైసిపి మద్దతివ్వాలన్నారు.

 

ప్రధాని ఇంటి ముందు ఎంపిలు ధర్నా చేసి సాధించాలన్నారు.  మార్చి మొదటి వారంలో అన్ని రాజకీయ పక్షాలను కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు. రెండో వారంలో అన్ని తహసీల్దార్ల ఆఫీసుల వద్ద ఆందోళన చేపడతామన్నారు. మార్చి చివరి వారంలో ఢిల్లీలో ధర్నాకు దిగుతామన్నారు. అనంతపురం జిల్లా సమస్యల పరిష్కారానికి 5 రోజుల జీపుజాతా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు.

 

ఈ సమావేశంలో ప్రొ. సదాశివ రెడ్డి, కవి గుత్తా హరి, విద్యార్థి, యువజన జెఏసి జిల్లా అధ్యక్షుడు బిసి సురేష్ , నగర అధ్యక్షులు చిక్కన్న, జిల్లా కార్యదర్శి ప్రవీణ్, ఉపాధ్యక్షులు హరి, ఆదర్శ్, చంద్ర, రఘు, గోపి, గణేష్, చరణ్, మోహన్, నాగార్జున, గురు, మురళి, కార్తీక్, సాయి, ప్రసన్న, కిరణ్, శ్రీరాం, తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాలు ఉధృతం: చలసాని శ్రీనివాస్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *