Top Ad unit 728 × 90

మార్కెట్లోకి బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనం...!

మార్కెట్లోకి బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనం...!

వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనం త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదలకు సంబంధించిన పలు విషయాలు వెల్లడయ్యాయి. 2020, జనవరి 14న సంస్థ ఈ ద్విచక్రవాహనాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ స్కూటర్ ధర సుమారు రూ.1.20లక్షలు(ఎక్స్‌ షోరూం) ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. ఈ ద్విచక్రవాహన విక్రయాలు మొదట పుణెలో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత దశల వారీగా బెంగళూరు సహా ఇతర మెట్రోనగరాల్లోనూ విక్రయిస్తామని సంస్థ ఇదువరకే తెలిపింది. స్కూటర్‌ విడుదల చేసిన తర్వాత బుకింగ్స్‌ ప్రారంభం అవుతాయని సంస్థ వెల్లడించింది.

 

బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌ విశేషాలు…!


ఈ స్కూటర్‌కు 4కిలోవాట్ల విద్యుత్‌ మోటర్‌, దానికి శక్తినిచ్చేలా లిథియం అయాన్‌ బ్యాటరీలను అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే ఎకో మోడ్‌లో దాదాపు 95 కిలోమీటర్లు, స్పోర్ట్స్‌ మోడ్‌లో దాదాపు 85 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్‌కు అన్ని రకాల ఆధునిక రైడింగ్‌ సదుపాయాలు కల్పించారు. మెటల్‌ బాడీ, ఎల్‌ఈడీ లైట్లు, సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌ ఫీచర్లు ఉండనున్నాయి. అలాయ్‌ వీల్స్‌తో పాటు దీనికి ప్రభావవంతమైన బ్రేకింగ్‌ కోసం డిస్క్‌ బ్రేక్‌ సిస్టమ్‌ అమర్చినట్లు సంస్థ గతంలో వెల్లడించింది. ఈ స్కూటర్‌కు మూడేళ్లు లేదా, 50వేల కిలోమీటర్లు వారెంటీ పొందవచ్చని తెలుస్తోంది.

 

మహారాష్ట్రలోని చకన్‌ కర్మాగారంలో చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారీ చేపట్టినట్లు ఇదువరకే బజాజ్‌ ఎండీ రాజీవ్ వెల్లడించారు. ఈ కర్మాగారంలో మొత్తం మహిళా కార్మికులే తయారీలో పాల్గొంటారు. ఇప్పటికే ఈ స్కూటర్‌ బజాజ్‌ సంస్థ చేతక్‌ యాత్రలో భాగంగా పలు నగరాల మీదుగా 3వేల కిలోమీటర్లు ప్రయాణాన్ని పూర్తి చేసింది.

 

ప్రతిరోజు ఉదయం ఈ భక్తి పాటలు వినండి భగవంతుని ఆశీస్సులు పొందండి.

మార్కెట్లోకి బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *