Top Ad unit 728 × 90

మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెడుతున్నారా... ఐతే ఈ విషయాలు తెలుసుకోండి

మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెడుతున్నారా... ఐతే ఈ విషయాలు తెలుసుకోండి

 

మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించే అవకాశం ఉంది. కానీ ఇవి మార్కెట్ ఒడిదొడుకులకు ప్రభావితమవుతాయి. అసెట్‌ క్లాస్‌ ప్రాధాన్యతలు, నష్టభయంతో సంబంధం లేకుండా ఈ పెట్టుబడులను ఎంచుకోవచ్చు. కొన్ని రకాల పండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్లు మంచి పెట్టుబడి మార్గాలుగా ఉండవచ్చు. కానీ వీటిల్లో రిస్క్ ఆధారంగానే రాబడి ఉంటుంది. సాధారణంగా ఎక్కువ రాబడిని ఆశించే ఫండ్లలో పెట్టుబడులు ఎక్కువ రిస్క్‌తో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. వీటిల్లో పెట్టుబడులు పారదర్శకంగా ఉండటంతో పాటు రిటర్న్స్‌ను జెనరేట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మామూలు వ్యక్తులు కొద్దిపాటి సమాచారం తెలుసుకొని వీటిల్లో సులభంగా పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ అంతకు ముందు మ్యూచువల్ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్లపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. మొదటిసారి వీటిల్లో పెట్టుబడులు పెట్టేవారు కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి.

రిస్క్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేవారు రాబడితో పాటు రిస్క్ లేదా నష్టభయాన్ని అంచనా వేయగలగాలి. కానీ చాలామంది ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్తారు. దీంతో ఆశించిన రాబడి రాకపోగా, కొన్నిసార్లు ఎంచుకున్న ఫండ్స్‌లో రిస్క్‌ ఎక్కువగానూ ఉండవచ్చు. ఆర్థిక లక్ష్యాల కోసం 9 శాతం ROI అవసరం అవుతుందని భావించినప్పుడు, అంతే ఆదాయం వచ్చే నష్టభయం లేని ఫండ్లను ఎంచుకోవాలి. అలా కాకుండా 16 శాతం వరకు రిటర్న్ ఇచ్చే ఫండ్లను ఎంచుకుంటే, అంతే మొత్తంలో రిస్క్ కూడా ఉంటుంది. ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ అనవసర రిస్క్‌ లేకుండా ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకోవచ్చు. పెట్టుబడిదారులు ఎల్లప్పుడూ తమ రిస్క్ ప్రొఫైల్‌కు తగిన మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్లను ఎంచుకోవాలి.

SIPల ద్వారా కాకుండా ఒకేసారి పెట్టుబడులు చేయడం: తక్కువ నష్టభయం ఉంటూ, తక్కువ రాబడిని అందించే డెట్ ఫండ్లను ఎంచుకున్నవారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు లేదా SIPల ద్వారా కాకుండా ఒకేసారి లంప్‌సమ్ పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ ఈక్విటీ ఫండ్లలో మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడి పెట్టడం ఎక్కువ రిస్క్‌తో కూడుకున్న విషయం. SIPల ద్వారా పెట్టుబడి పెట్టినప్పుడు రిస్క్‌ ప్రభావం కూడా తగ్గుతుంది. ఈ మార్గం ద్వారా రూపీ కాస్ట్ యావరేజింగ్‌ లబ్ధి పొందుతూ, దీర్ఘకాలంలో మంచి రాబడిని సాధించవచ్చు. డెట్ ఫండ్లలో ఒకేసారి ఇన్వెస్ట్ చేసి, ఈక్విటీ ఫండ్ SIPల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా పెట్టుబడిదారులు రెగ్యులర్ రిటర్న్స్ అందుకోవచ్చు.

అవసరం లేని సెక్టోరల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు ప్రారంభించినవారు రిస్క్ తగ్గించడం కోసం డైవర్సిఫికేషన్ ద్వారా పెట్టుబడులను సురక్షితమైన మార్గాలకు మళ్లించాలి. కస్టమర్లు ఒకే అసెట్ క్లాస్‌లో విభిన్న సెక్టార్లు, విభిన్న ఇనుస్ట్రుమెంట్లను ఎంచుకోవచ్చు. కానీ సెక్టోరల్ ఈక్విటీ ఫండ్స్ పరిశ్రమలు లేదా ఇతర రంగాలపై దృష్టి సారిస్తాయి. వీటిల్లో డైవర్సిఫికేషన్ ఉండదు. అండర్ లైయింగ్ సెక్టార్ పనితీరు సరిగా లేనప్పుడు ఫండ్ విలువ తగ్గిపోతుంది. అందువల్ల ఈక్విటీ మార్కెట్‌కు అలవాటు పడిన తరువాత ఫండ్‌లో కొంత భాగాన్ని సెక్టోరల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ సరైన అవగాహన, ప్రణాళిక లేని కొత్త పెట్టుబడిదారులు సెక్టోరల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం చాలా రిస్క్‌తో కూడుకున్నది. దీనికి దూరంగా ఉండటం మంచిది.

 

మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టడం: అందుబాటులో ఉన్న వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ స్కీంలలో ఖర్చుల నిష్పత్తి, ఎగ్జిట్ లోడ్, ట్యాక్స్ పాలసీ వంటివి మారవచ్చు. ఉదాహరణకు.. మూడు సంవత్సరాల ముందు డెట్ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయితే, దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేదా STCGగా పరిగణిస్తారు. మూడు సంవత్సరాలకు మించితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేదా LTCG కిందకు వస్తుంది. వీటిపై విధించే ట్యాక్స్ వేర్వేరుగా ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఇదే గడువుకు ట్యాక్స్ కూడా వేరుగా ఉంటుంది. వీటన్నింటి గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతే ఫండ్లలో పెట్టుబడులను ఎంచుకోవాలి. అవసరమైతే సర్టిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్ల సహాయం తీసుకోవచ్చు.

టార్గెట్ కార్పస్ వచ్చిన తరువాత కూడా ఎక్కువ రిస్క్ ఉండే ఫండ్లలో కొనసాగడం: రిస్క్ ప్రొఫైల్, లిక్విడిటీ అవసరాలు తీరిన తరువాత, అవసరమైన కార్పస్ వచ్చిన తరువాత కూడా ఎక్కువ రిస్క్ ఉండే ఫండ్లలో పెట్టుబడులు కొనసాగించకూడదు. కస్టమర్లు అనుకున్న టార్గెట్ టెన్యూర్‌కు ముందే ఎంచుకున్న ఫండ్ల ద్వారా ఆశించిన రాబడి వచ్చినప్పుడు లాభాలను బుక్ చేసుకోవాలి. లక్ష్యాలు చేరుకున్న తరువాత కూడా ఎక్కువ రిస్క్ ఉండే ఫండ్లలో కొనసాగులూ రిస్క్‌ పెంచుకోకూడదు. మిగిలిన టెన్యూర్‌కు నష్టాల అవకాశాలను తొలగించడం కోసం తక్కువ రిస్క్ ఉండే మ్యూచువల్ ఫండ్ స్కీంకు కార్పస్‌ను మార్చాలి.

మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెడుతున్నారా... ఐతే ఈ విషయాలు తెలుసుకోండి Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2021

Contact Form

Name

Email *

Message *