Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

3 నెలల లాక్ డౌన్ తర్వాత కొత్త ఉత్సాహంతో రేడివుతున్న బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్‌.. ఏపీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు చర్యలు ప్రారంబించిన  ఉన్నతాధికారులు.. కరోన వైరసును ఎదుర్కునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు  చేస్తున్న  రైల్వే శాఖ అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై  వాయుద వేసిన  ఏపీ హైకోర్టు. కరోనాతో మృతిచెందితే అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి రూ 15వేలు ఇవ్వాలనన్న ఏపి ముఖ్యమంత్రి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాము రేపుటి నుంచి మూసివేయునున్నర..? బీహార్‌లో సంపూర్ణ లాక్ డౌన్…! ఆకాశంలో అరుదైన దృశ్యం, భారత్‌కి దగ్గరగా తోకచుక్క...! అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ విండోస్ 10కి వచ్చింది చూశారా...! విశాఖ ఫార్మాసిటీలో పేలుడుపై ఏపీ మంత్రి ఆరా…!   

100 కేజీల కేక్ ను కట్ చేయించిన నిమ్మకాయల వ్యాపారస్తులు, ఎందుకో తెలుసా…!  

100 కేజీల కేక్ ను కట్ చేయించిన నిమ్మకాయల వ్యాపారస్తులు, ఎందుకో తెలుసా…!  

 

PSLV TV ఏలూరు: గౌరవనీయులైన డిప్యూటీ సీఎం శ్రీ ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) గారి ఆశీస్సులతో, దశాబ్దాల కాలంగా తీరని కోరికగా ఉన్న ఏలూరు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డులోని నిమ్మకాయల వ్యాపారం సులభతరం చేయడమే గాకుండా అర్హులందరికీ షాపులు కేటాయించి మా అందరి జీవితాలలో వెలుగులు నింపిన మా దైవం డిప్యూటీ సీఎం గౌ. శ్రీ ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) గార్కి అభినందనలు తెలుపుతూ, శ్రీలక్ష్మి నిమ్మకాయల వర్తక సంఘంలోని సభ్యులందరూ కలిసి 100 కేజీల కేక్ ను ఆయనతో కటింగ్ చేయించడం జరిగింది.

 

కేక్ కట్ కటింగ్ అనంతరం డిప్యూటీ సీఎం గౌ. శ్రీ ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) గారు, యార్డులో వర్తక సంఘ సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ, పేదవారు ఆర్థిక వృద్ధి సాధించాలనే ఆశయంతో నా బాధ్యతగా నేను చేసిన సహాయం మీలో ఇంతలా ఆనందాన్ని కలిగిస్తుందని అనుకోలేదు. మీలో కలిగిన ఈ సంతోషం, ఆనందమే నాకు చాలా సంతృప్తినిచ్చాయి. మీ సంతోషాన్ని నాతో  కలిసి పంచుకోవడం నేను ఊహించలేదంటూ చాలా ఆనందంతో ఉద్విగ్నులయ్యారు. మీరు వ్యాపారంలో మంచి వృద్ధిని సాధిస్తూ మిమ్మల్నే నమ్ముకుని మీ మీద ఆధారపడ్డ కార్మికులు మీలాగా ఇదే విధంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మీరు కటింగ్ చేయించిన ఈ వంద కేజీల కేక్ ను వృధా చేయకుండా స్కూల్ పిల్లలకి ఇవ్వండని గౌ శ్రీ ఆళ్ళ నాని గారు చెప్పడం ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.

 

ఈ కార్యక్రమాన్ని వెనుక నుండి నడిపించిన మా ఆప్తులు గౌ శ్రీ మంచెం మైబాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతాభినంనలు తెలియజేసుకుంటున్నాము. అలాగే అన్ని వేళలా మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ‌సహయ సహకారాలు అందిస్తూ వస్తున్న మా అన్న గౌ.శ్రీ బొద్దాని శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అన్నారు వ్యాపారస్తులు.  

 

శ్రీ లక్ష్మి నిమ్మకాయల వర్తక సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ వై. అన్నవరం గారు తొడ కండరాల గాయం కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ తలపెట్టిన పని పూర్తయ్యే వరకూ అహర్నిశలు కృషి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

 

ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారితో పాటు మంచెం మైబాబు గారు, బొద్దాని శ్రీనివాస్ గారు, గుడిదేసి శ్రీను గారు, వై అన్నవరం గారు, రంగ ముత్యాలు గారు, రవి కిరణ్ గారు, శ్రీ లక్ష్మి నిమ్మకాయల వర్తక సంఘ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, పార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్: రవి పామర్తి, ఏలూరు.

100 కేజీల కేక్ ను కట్ చేయించిన నిమ్మకాయల వ్యాపారస్తులు, ఎందుకో తెలుసా…!   Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *