Top Ad unit 728 × 90

ఇరాన్‌ను వణికించిన భూకంపం... నలుగురు మృతి

ఇరాన్‌ను వణికించిన భూకంపం... నలుగురు మృతి

 

ఇరాన్‌ లో భారీ భూకంపం సంభవించింది. ఈశాన్య నగరమైన కష్మార్‌ లో మంగళవారం మధ్యాహ్నం 1:24 గంటలకు భూమి కంపించింది.

 

భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 4.9గా నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. సుమారు 120 మందికి గాయాలైనట్లు రాష్ట్ర మీడియా నివేదించింది.

 

భూమికి 10 కిలోమీటర్ల (ఆరు మైళ్లు) లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం ధాటికి భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. పలు భవనాలు దెబ్బతిన్నట్లు కష్మార్‌ గవర్నర్ హజతుల్లా షరియత్‌మదారి ప్రకటించారు. రోడ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు.

 

ఇరాన్ వివిధ టెక్టోనిక్ ప్లేట్లలో ఉండగా, ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. గతేడాది ప్రారంభంలో కూడా టర్కీ సరిహద్దుకు సమీపంలో ఇరాన్ వాయువ్య పర్వత ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. సుమారు 800 మందికి పైగా గాయపడ్డారు. అదేవిధంగా అత్యంత భయంకరమైన భూకంపం 2003లో ఇరాన్‌లో సంభవించింది. ఆగ్నేయ ఇరాన్‌లోని బామ్‌లో 6.6 తీవ్రతతో సంభవించగా, భూకంపం ధాటికి 31,000 మందికి పైగా మరణించారు.

 

ఇరాన్‌ను వణికించిన భూకంపం... నలుగురు మృతి Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *