జీవాలపై కి దూసుకెళ్లిన లారీ
బ్రేకింగ్ న్యూస్....
కృష్ణాజిల్లా... నూజివీడు
నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదం.50 గొర్రెలు అక్కడికక్కడే మృతి. నూజివీడు మండలం సుంకొల్లు గ్రామానికి చెందిన మాగంటి నారాయణ, ఆర్ల వెంకటేశ్వరరావు, మాగంటి శ్రీనివాసరావు లకు చెందిన 200ల గొర్రెలను గుడివాడ వైపు తోలుకు వెళుతుండగా హనుమాన్ జంక్షన్ నుండి వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. దూరంనుండి గమనించిన గొర్రెలకాపరులు లారీని ఆపే ప్రయత్నం చేయగా, లారీ తమ మీద కె వస్తుండడంతో భయకంపితులై పారిపోయినట్లు బాధితులు పేర్కొన్నారు. గొర్రెల మృతి తో 5 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని, తమకు జీవనోపాధి కరువైందని గొర్రెలకాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బాధితులైన గొర్రెల కాపరులు నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రూరల్ ఎస్ఐ సిహెచ్ రంజిత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
