Top Ad unit 728 × 90

సందు గొందులు రోడ్లలో కి భారీ వాహనాలు అనుమతించవద్దని నూజివీడు వాసుల ఆందోళన

(నూజివీడు,): సందు గొందులు లోకి భారీ వాహనాలను అనుమతించవద్దంటూ నూజివీడు పట్టణంలోని కోనేరు పేట వాసులు విన్నవిస్తారు. పలు రోడ్ల నిర్మాణాల నిమిత్తం భారీ కంటెయినర్లలో కంకర చిప్స్, సిమెంటు, ఇసుక, ఇనుప చువ్వ లను పట్టణాల్లోని కోనేరు పేట లో గల పాఠశాలకు వెళ్లే రహదారి వెంబడి భారీ వాహనాలతో తరలించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కోనేరు పేట వాసులు వాపోతున్నారు. ఇటీవల ఇటుగా వేగంగా వెళుతున్న భారీ వాహనాలు ఢీకొనడంతో, తమ ఇళ్ల ముందు ఉన్న ద్విచక్ర వాహనాలు సైతం నుజ్జునుజ్జు అయ్యాయని కోనేరు పేట లోని ఇంటి యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఈ వాహనాలతో రోడ్లు వేసేందుకు మెటీరియల్ తరలించే నిమిత్తం తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని ఎవరు అడ్డు చెప్పిన ప్రయోజనం ఉండదు అంటూ వాహనచోదకులు, యజమానులే పేర్కొనడంతో కోనేరు పేట నివాస ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం ప్రముఖ యువ న్యాయవాది ద్విచక్రవాహనం పూర్తిగా నుజ్జవ్వగా ఈ ప్రాంతంలో మరింత ఆందోళన చెలరేగినట్లు ఉందని అక్కడి వారు పేర్కొంటున్నారు. ఈ ఘటన అంత ఆషామాషీగా తేలేది కాదని, యువ న్యాయవాది అంత ఈజీగా ఈ సంఘటన వదిలిపెట్టే వ్యక్తి కాదని, కాంట్రాక్టర్ కు, వాహన యజమానులకు భారీ జరిమానాలు తప్పవని, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నివాసాల మధ్య లోకి భారీ వాహనాలు కాకుండా, చిన్న వాహనాలు ట్రాక్టర్లతో మెటీరియల్ తరలిస్తే ఎంతటి నష్టం, భయాందోళనలు చెలరేగవని ప్రజలు తెలియజేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు సకాలంలో స్పందించి నివాస ప్రాంతాల మధ్య కు భారీ వాహనాలను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించవద్దని కోనేరు పేట ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

సందు గొందులు రోడ్లలో కి భారీ వాహనాలు అనుమతించవద్దని నూజివీడు వాసుల ఆందోళన Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2021

Contact Form

Name

Email *

Message *