వయనాడ్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
వయనాడ్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేరళ పర్యటన ఖరారైంది. ఇటీవలే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వయనాడ్ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే.
ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని మోడీ వయనాడ్ వెళ్లనున్నారు. ఆగస్టు 10వ తేదీన కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కేరళ బయల్దేరి వెళ్తారు.
అక్కడ కన్నూర్లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం ప్రమాద బాధితుల్ని మోడీ పరామర్శించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి. కాగా, వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పరిహారం పెంచాలని, సమగ్ర పునరావాస ప్యాకేజీని ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు లోక్సభలో కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ వయనాడ్ పర్యటకు ప్రాధాన్యత సంతరించుకుంది.