Top Ad unit 728 × 90

పెద్దనాన్న కొడుకులే పశువుల్లా ప్రవర్తించారు..



పెద్దనాన్న కొడుకులే పశువుల్లా ప్రవర్తించారు..


మానవత్వం మంటగలిసింది.. రక్షణగా ఉండాల్సిన అన్నలే (పెద్దనాన్న కుమారులు) అఘాయిత్యానికి పాల్పడ్డారు. ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారితో ఇద్దరు సోదరులు  పశువుల్లా ప్రవర్తించారు. కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ దుర్ఘటన ఆలస్యంగా బయటపడింది. హన్మకొండ సుబేదారి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సీఐ సదయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

 

నగరంలో ఇద్దరు సొంత అన్నదమ్ములు పక్కప్కనే నివాసం ఉంటున్నారు. వారిలో అన్నకు పాలిటెక్నిక్‌, బీటెక్‌ చదివే ఇద్దరు కుమారులు ఉండగా, తమ్ముడికి ఐదేళ్ల కూతురు ఉంది. అయితే విద్యార్థి దశలోనే కామంతో కళ్లుమూసుకుపోయిన ఆ ఇద్దరు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చెల్లి వరుస అయిన చిన్నారిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాకుండా రాయడానికి వీలులేకుండా చిన్నారిని హింసించారు. 

 


దీంతో అనారోగ్యానికి గురైన చిన్నారి పరిస్థితిని తల్లిదండ్రులు గుర్తించడంతో విషయం బయటపడింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇద్దరు విద్యార్థులపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *