Top Ad unit 728 × 90

వాలెంటైన్స్ డే రోజు లవర్స్ పెట్టుకునే ఈ 18 రకాల ముద్దులు...


వాలెంటైన్స్ డే రోజు లవర్స్ పెట్టుకునే ఈ 18 రకాల ముద్దులు...

కపుల్స్ అన్నాక ఎన్నో రకాలుగా ముద్దు పెట్టుకుంటారు. వాటి గురించి మనమైతే చెప్పలేం. కానీ నిజానికి మీకు తెలుసా..? ఇలా కపుల్స్ పెట్టుకునే ముద్దుల్లో మాత్రం పలు రకాలు ఉన్నాయి. మొత్తం 100 రకాల ముద్దులను వారు పెట్టుకుంటారట. ఈ క్రమంలోనే కపుల్స్ పెదవులు వారిలో ఉన్న అనేక భావాలను తెలుపుతాయట. అలా అని చెప్పి మేం అనడం లేదు. షెరిల్ కిర్షేన్‌బామ్ తన పుస్తకంలో రాశారు. ది సైన్స్ ఆఫ్ కిస్సింగ్ అనే పుస్తకంలోనే షెరిల్ అనేక ముద్దు రకాలను వివరించారు. వాటిలో 18 రకాల ముద్దులను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. ది ఫ్రెంచ్ కిస్
కపుల్స్‌లో ఫ్రెంచ్ కిస్‌కు ప్రత్యేక స్థానం ఉందనే చెప్పవచ్చు. ముద్దులన్నింటిలోకెల్లా ఈ ముద్దు చాలా పాపులర్‌. ఈ కిస్ కపుల్స్ మధ్య ఉండే అతీతమైన ప్రేమకు చిహ్నమట. కపుల్స్ అందరూ ఈ కిస్‌ను పెట్టుకోవడంలో ఆరి తేరి ఉండాలట.
2. ది క్విక్ కిస్
ఈ కిస్ ఫ్రెంచ్ కిస్‌కు కొనసాగింపుగా ఉంటుంది. కపుల్స్ దీన్ని పబ్లిక్‌లోనూ పెట్టుకోవచ్చు. ఇందులో ఒక పార్ట్‌నర్ తన క్లోజ్ చేసిన పెదవులను తన మరో పార్ట్‌నర్ క్లోజ్ చేసిన పెదవులపై కిస్ చేయడం ద్వారా ముద్దు పెట్టుకుంటారు. చాలా కాలం నుంచి ఈ కిస్‌ను కపుల్స్ పెట్టుకుంటున్నారు.
3. ఎ కిస్ ఆన్ ది చీక్
బుగ్గ మీద కిస్ పెడితే హాయ్ అని చెప్పి ఒకరినొకరు పలకరించుకున్నట్టు అవుతుందట. హ్యాండ్ షేక్‌కు బదులుగా కపుల్స్ దీన్ని వాడుకోవచ్చు. లవర్స్ ఈ కిస్‌ను రెగ్యులర్‌గా ఎంజాయ్ చేయవచ్చు.
4. బ్లోయింగ్ ఎ కిస్
కిస్ అనేది భౌతికంగా పెట్టుకునేదే కాదు, లవ్ ఎక్కువైతే కపుల్స్ తమ కిస్‌ను గాల్లోకి వదలవచ్చు. అంటే.. కిస్ చేసి దాన్ని గాల్లోకి పంపితే అవతలి పార్ట్‌నర్ దాన్ని స్వీకరిస్తారన్నమాట. ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ఈ తరహా కిస్ పెట్టుకుంటారు కపుల్స్‌.
5. ది లాక్ కిస్
ఈ కిస్ పెట్టుకుంటే కపుల్స్ ఇద్దరూ విడిపోకుండా ఉంటారట. ఎందుకంటే ఈ కిస్ వల్ల కపుల్స్ పెదవులు నాలుగు లాక్ అయిపోయినట్టు కలుస్తాయట. దీంతో వారి మధ్య ప్రేమ మరింత పెరుగుతుందట.
6. ది ఏంజెల్స్ కిస్
కపుల్స్ తమ పార్ట్‌నర్ నిద్రపోయే సమయంలో వారి కను రెప్పలపై కిస్ చేస్తారు. దీన్నే ఏంజెల్స్ కిస్ అంటారు. ఇది ఇద్దరి మధ్య ఉన్న అమితమైన ప్రేమానురాగాలను నిదర్శనంగా ఉంటుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది.
7. ది నోస్ కిస్
కపుల్స్ ఈ కిస్ పెట్టుకుంటే ఒకరిపై ఒకరికి అటెన్షన్ పెరుగుతుంది. మూడ్ మారుతుంది. హాయిగా నవ్వుకోవచ్చు. ఎంజాయ్ చేయవచ్చు. సాధారణంగా ఈ కిస్‌ను కపుల్స్ క్షమాపణలు చెప్పేందుకు సింబాలిక్‌గా వాడుతారు. దీంతో ఎవరి ఫీలింగ్స్ హర్ట్ కాకుండా ఉంటాయి.
8. ది ఫోర్ హెడ్ కిస్
దీన్ని మదర్స్ కిస్ అని కూడా పిలుస్తారు. తల్లి పెట్టే ముద్దు అంత ఆప్యాయంగా ఉంటుంది. అంత ఆప్యాయత ఉండాలనే కపుల్స్ ఈ కిస్ పెట్టుకుంటారు.
9. ది ఇయర్ కిస్
మన శరీరంలో చెవులు చాలా సున్నితమైన అవయవాల కిందకు వస్తాయి. అయితే చెవిపై ముద్దు పెట్టుకుంటే కొందరు కపుల్స్‌కు గిలిగింత పెట్టినట్టుగా అనిపిస్తుంది. అందుకనే దీన్ని కపుల్స్ పెట్టుకుంటారు. అవతలి పార్ట్‌నర్‌ను మంచి మూడ్‌లోకి తెచ్చేందుకు, వారిని ఉత్సాహంలో నింపేందుకు ఇలాంటి కిస్ పెడతారు.
10. ది ఇయర్ లోబ్ కిస్
కపుల్స్ ఇద్దరూ మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నప్పుడు పెట్టుకునే కిస్ ఇది. ఇది వారి మధ్య అన్యోన్యతను పెంచుతుంది. ఇద్దరూ సఖ్యతగా ఉండేందుకు దోహదం చేస్తుంది.
11. ది హ్యాండ్ కిస్
చాలా పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్న కిస్ ఇది. ఇతరుల పట్ల మనకు ఎంతటి మర్యాద ఉందో ఈ కిస్ తెలియజేస్తుంది. అయితే ఈ కిస్‌ను కపుల్స్ పెట్టుకుంటే పురుషుడు తన మోకాళ్ల మీద కూర్చుని స్త్రీ చేయి మీద ఈ కిస్ పెట్టాల్సి ఉంటుంది. దీన్ని కాంప్లిమెంట్‌గా భావిస్తారు. అయితే నేటి తరుణంలో కేవలం కపుల్స్ మాత్రమే ఈ తరహా కిస్‌లను ఫ్రెండ్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమకు చిహ్నంగా ఈ కిస్‌ను పెట్టుకుంటారు.
12. ది నెక్ కిస్
మెడ ముందు, పక్క భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో కపుల్స్ కిస్‌లు పెట్టుకుంటే ఇక వారి మధ్య మంచి రొమాంటిక్ మూడ్ వస్తుంది. అందుకే కపుల్స్ ఈ కిస్ ను ఎక్కువగా పెట్టుకుంటారు.
13. ది వాంపైర్ కిస్ లేదా హికీ
మెడపై చిన్నపాటి గాయంతో కూడిన కిస్‌నే హికీ అంటారు. స్త్రీలు పురుషుల మెడపై తమ లిప్ స్టిక్ మార్క్‌ను ఈ విధంగా వేసినా దీన్ని హికీ అని భావిస్తారు. ఇది ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యమైన సంబంధానికి గుర్తుగా పెట్టుకునేది.
14. ది సింగిల్ లిప్ కిస్
కపుల్స్‌లో ఎవరైనా ఒకరు కేవలం పై పెదవి లేదా కింది పెదవితోనే కిస్ చేస్తే దాన్ని సింగిల్ లిప్ కిస్ అంటారు. ఇది సంతోషంగా ఉండే కపుల్స్ పెట్టుకునే కిస్‌. లవ్‌లో ఉన్న కపుల్స్ కొత్తలో ఇలాంటి కిస్‌లు పెట్టుకుంటారు.
15. ది ఎస్కిమో కిస్
దీన్ని నిజానికి అయితే కిస్ అని అనరు. కానీ లవ్‌ను తెలియజేసేందుకు ఎస్కిమోలు వాడుతారు కనుక దీనికి ఎస్కిమో కిస్ అనే పేరు వచ్చింది. ఇందులో కపుల్స్ తమ ముక్కులను ఒక దానితో మరొకటి రాసుకుంటారు. పలు ఆఫ్రికా దేశాల్లోనూ ఈ తరహా కిస్‌లను పెట్టుకుంటారు.
16. ది లోయర్ లిప్ బైట్
ఫ్రెంచ్ కిస్‌లో ఇదొక భాగం. ఇందులో కపుల్స్ తమ పార్ట్‌నర్ కింది లేదా పై పెదవిని సుతారంగా కొరుకుతారు. అవతలి పార్ట్‌నర్‌పై తమకు ఎంత ప్రేమ ఉందో తెలియజేసేందుకు ఈ కిస్‌ను పెట్టుకుంటారు.
17. ది వాక్యూమ్ కిస్
కపుల్స్ ఇద్దరూ ఒకరి పెదవులను మరొకరు గట్టిగా పట్టుకుని బంధించేస్తారు. గాలి కూడా చొరబడనంత డీప్‌గా ఈ కిస్ పెట్టుకుంటారు. కనుకనే దీనికి వాక్యూమ్ కిస్ అని పేరు వచ్చింది. ఈ కిస్ పెట్టుకుంటే కపుల్స్ రిఫ్రెష్‌మెంట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే శక్తి బాగా ఖర్చవుతుంది.
18. బాడిలీ కాంటాక్ట్
దీన్ని చాలా బ్యాలెన్స్‌డ్ కిస్ అని చెప్పవచ్చు. కపుల్స్‌కు ఈ కిస్ చాలా వింతైన అనుభూతిని ఇస్తుంది. గుడ్ బై చెప్పేందుకు ఈ కిస్ పెట్టుకుంటారు. పబ్లిక్‌లోనూ ఈ కిస్ పెట్టుకోవచ్చు. అయితే ఈ కిస్ పెట్టుకునేటప్పుడు కపుల్స్ ఇద్దరి శరీరాలు కూడా దగ్గరగా ఉండి కాంటాక్ట్ అవ్వాలి. ఎంత ఎక్కువ సేపు ఈ కిస్ పెట్టుకుంటే కపుల్స్ మధ్య అంత ఎక్కువ లవ్ ఉన్నట్లు భావించాలి.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *