Top Ad unit 728 × 90

దక్షిణ కొరియాకు స్వర్ణం...!


దక్షిణ కొరియాకు స్వర్ణం...!

వింటర్ ఒలింపిక్స్‌లో ఆతిథ్య దక్షిణ కొరియాకు స్వర్ణం లభించింది. షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్‌లో భాగంగా జరిగిన పురుషుల 1500 మీటర్ల విభాగంలో కొరియా ఆటగాడు లిమ్ హ్యోజు పసిడి పతకం దక్కించుకున్నాడు. మరోవైపు నెదర్లాండ్స్ కు చెందిన సిజిన్‌కికు రజతం లభించింది. రష్యా ఆటగాడు సిమెన్ కాంస్య పతకాన్ని సాధించాడు. మరోవైపు మహిళల ఫ్రీస్టియిల్ స్కీయింగ్‌లో భాగంగా జరిగిన మొగల్స్ విభాగంలో ఫ్రాన్స్ క్రీడాకారిణి పెరైన్ లఫొంట్ స్వర్ణం గెలుచుకుంది. కెనడాకు చెందిన జస్టిన్ డుఫోర్‌కు రజతం,కజకిస్తాన్ క్రీడాకారిణి యులియాకు కాంస్యం లభించాయి. పురుషుల లూజ్ విభాగం సింగిల్స్‌లో ఆస్ట్రియా ఆటగాడు డేవిడ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అమెరికా ఆటగాడు క్రిస్ మజ్దర్‌కు రజతం, జోహన్నెస్ (జర్మనీ)కు కాంస్య పతకాలు దక్కాయి. స్కి జంపింగ్‌లో జర్మనీ క్రీడాకారుడు అండ్రిస్ వెలింగర్ పసిడి పతకాన్ని సాధించాడు. నార్మల్ హిల్ విభాగం పోటీల్లో అద్భుత ఆటను కనబరిచిన అండ్రిస్ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు. నార్వేకు చెందిన జోహన్‌కు రజతం, అదే దేశానికి చెందిన రోబర్‌కు కాంస్య పతకాలు లభించాయి. మరోవైపు బయథ్లాన్‌లో భాగంగా జరిగిన పురుషుల 10 కి.మీ. విభాగంలో జర్మనీ అథ్లెట్ అర్న్‌డ్ ఫిఫర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. చెక్ ఆటగాడు మైఖల్‌కు రజతం, ఇటలీ క్రీడాకారుడు డొమినిక్‌కు కాంస్యం లభించాయి. మహిళల 7.5 కిలో మీటర్ల స్ప్రిట్ విభాగంలో జర్మనీ అథ్లెట్ లౌరా డాల్మియర్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. నార్వే అథ్లెట్ మార్టెకు రజతం, వెరొనికా (చెక్)కు కాంస్య పతకాలు దక్కాయి. 15 కి.మీ. స్కియాథ్లాన్‌లో స్వీడన్‌కు స్వర్ణం, నార్వేకు రజతం లభించాయి. ఫిన్‌లాండ్‌కు ఈ విభాగంలో కాంస్యం లభించింది. కాగా, ఐస్ డాన్సింగ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో రష్యా జట్టు స్వర్ణం గెలుచుకుంది. కెనడాకు రజతం, అమెరికాకు ఈ విభాగంలో కాంస్య పతకాలు దక్కాయి.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *