Top Ad unit 728 × 90

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు హమీదా కన్నుమూత...!


కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు హమీదా కన్నుమూత...!

 ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బేగం హమీదా హబీబుల్లా మంగళవారం తన నివాసంలో సుదీర్ఘ అస్వస్థతతో కన్నుమూశారు. ఆమె వయస్సు 102 సంవత్సరాలు. రాజ్యసభ మాజీ సభ్యురాలైన హబీబుల్లా హైదరాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ దివంగత నవాబ్ నజీర్ జంగ్ బహదూర్ కుమార్తె. పుణెలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్ కమాండెంట్ జనరల్ ఇనయత్ హబీబుల్లాను బేగం హమీదా పెళ్లాడారు. వారి సంతానమైన వజాహత్ హబీబుల్లా భారత తొలి చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్‌గా పనిచేశారు. 1965లో తన భర్త ఆర్మీ నుంచి రిటైర్ కావడంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. హైదర్‌గఢ్ (బారాబంకీ) నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై 1971 నుంచి 1973 వరకూ హరిజన సంక్షేమం, జాతీయ సమైక్యత, సివిల్ డిఫెన్స్ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టూరిజం మినిస్టర్‌గా కూడా ఉన్నారు. అనంతరం యూపీ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా 1980 వరకూ ఉన్నారు. 1969 నుంచి ఏఐసీసీ సభ్యురాలిగా కూడా ఆమె ఎన్నికయ్యారు. యూపీసీసీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సేవలందించారు. 1976 నుంచి 1982 వరకూ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. మహిళా సాధికరతపై తరచు గళం వినిపించే నేతగా బేగం హబీబుల్లాకు పేరుంది. లండన్‌లోని వైట్‌ల్యాండ్ కాలేజీలో టీచర్ ట్రైనింగ్ చేసి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన బేగం హబీబుల్లా మహిళా విద్య కోసం పాటుపడ్డారు. 1975లో అవద్ గాళ్స్ డిగ్రీ కాలేజీ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. కాగా, సుదీర్ఘ అస్వస్థతతో కన్నుమూసిన బేగం హబీబుల్లా అంత్యక్రియలు బారాబంకీలోని ఆమె స్వగ్రామంలో ఇవాళ జరుపుతున్నారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *