Top Ad unit 728 × 90

తల్లి పెళ్ళికి తానే పెద్దైన తనయ ...!


తల్లి పెళ్ళికి తానే పెద్దైన తనయ ...!

సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా నిరాడంబరంగా కూతురికి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ ఓ కూతురే తన తల్లికి పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రెండో పెళ్లి చేసుకుంటేనే తప్పుగా అర్థం చేసుకుంటున్న ఈ రోజల్లో ఓ యువతి ఒంటరితనంతో బాధపడుతున్న తన తల్లికి ఘనంగా మరో పెళ్లి జరిపించిన ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకెళ్లితే.. 

జయపురకు చెందిన గీతా గుప్త అనే వివాహిత 2016లో తన భర్తను కోల్పోయింది. అప్పటినుంచి భర్తపోయిన బాధతో గీత కుమిలిపోతోంది. గీత కుమార్తె సన్హిత ఉద్యోగ రిత్యా వేరే ప్రాంతంలో ఉంటోంది. దాంతో గీత ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఆ బాధ చూడలేక సన్హిత తన తల్లికి ఓ తోడునివ్వాలనుకుంది. 'జీవితంలో ప్రతి మనిషికీ ఓ తోడు ఉండాలి. కొన్ని విషయాలు మన జీవితభాగస్వామితోనే పంచుకోగలం. అందుకే మా అమ్మకు తెలీకుండా మాట్రిమోనియల్‌ సైట్‌లో ఆమె వివరాలు పెట్టాను. చాలా సంబంధాలు వచ్చాయి.వారందరిలో గుప్తా అనే 55 ఏళ్ల వ్యక్తిని ఓకే చేశాం.ఈ విషయాన్ని ఇంట్లో చెబితే అందరూ నన్ను తిట్టారు. నేను చేసింది సరైనదో కాదో తెలీదు. కానీ మా అమ్మకు ఈ వయసులో ఓ తోడు కావాలి.అందుకే గుప్తాతో మా అమ్మ పెళ్లి చేశాను' అని తెలిపింది. గుప్తా కూడా తన భార్యను పోగొట్టుకున్నాడు.

అతనికి ఇద్దరు పిల్లలు. వారికోసమే గీతను వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. సన్హిత చేసిన పనికి ఇంట్లో వారు నోటికొచ్చినట్లు తిడుతున్నా తల్లి గురించి ఆలోచించి ఆమె చేసిన పనికి సమాజం ఆమెను మెచ్చుకుంటోంది.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *