Top Ad unit 728 × 90

అజహరుద్దీన్ విషయంపై పాకిస్తాన్ కోడై కూస్తోంది - వి హెచ్ ....


అజహరుద్దీన్ విషయంపై పాకిస్తాన్ కోడై కూస్తోంది - వి హెచ్ ....

భారత క్రికెట్ జట్లు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌ను హెచ్ సీ ఏ సమావేశానికి అనుమతించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అజహరుద్దీన్ కు జరిగిన అవమానంపై పాకిస్థాన్‌ కోడై కూస్తోందని వి. హనుమంతరావు అన్నారు. అజహరుద్దీన్ మనవాడేనా, కాదా చెప్పాలని వి. హనుమంతరావు డిమాండ్ చేశారు .ఇటీవల కాలంలో హెచ్ సి ఏ సమావేశానికి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ను అనుమతివ్వలేదు. సుమారు రెండు గంటల పాటు అజహరుద్దీన్ ఈ సమావేశానికి హజరుకానివ్వకుండా బయటే నిలబెట్టారు.ఈ విషయమై హెచ్ సి ఏ సమావేశంలో వి. హనుమంతరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ పరిణామాలపై వి. హెచ్ మరోసారి హెచ్ సి ఏ తీరును తప్పుబట్టారు.

అజహరుద్దీన్ ను హెచ్ సి ఏ సమావేశానికి అనుమతించకపోవడం పై వి. హనుమంతరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అవసరం తీరక ముందు ఓ రకంగా, అవసరం తీరిన తర్వాత మరో రకంగా వ్యవహరించడం సరికాదని వి. హెచ్ ఆగ్రహించారు . అజహరుద్దీన్ మనవాడో కాదో తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు . అజహరుద్దీన్ కు జరిగిన అవమానంపై పాకిస్థాన్ లో తీవ్ర ప్రచారం జరుగుతున్న విషయాన్ని హనుమంతరావు ప్రస్తావించారు. అజహర్ మనవాడా, కాదా అనే విషయాన్ని సీఎం కెసిఆర్ తేల్చి చెప్పాలని ఆయన పట్టుబట్టారు .

అజారుద్దీన్ హెచ్‌సీఏ మెంబర్ కాదని మొన్నటి వరకు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్ అన్నారు. కోర్టు అజారుద్దీన్ కి క్లీన్ చీట్ ఇచ్చినా హెచ్‌సీఏ అనుమతి ఇవ్వడం లేదన్నారు. అజారుద్దీన్ పై కుట్రతో వివేక్ ఇలా చేస్తున్నారని హనుమంతరావు విమర్శలు గుప్పించారు.అజహరుద్దీన్ పై రాజకీయంగా కుట్ర జరుగుతోందని హనుమంతరావు ఆరోపణలు గుప్పించారు. అజారుద్దీన్ పై కుట్రతో వివేక్ ఇలా చేస్తున్నారని హనుమంతరావు నిప్పులు చెరిగారు.తాను రాజకీయ కుట్రలతో హెచ్‌సీఏ మీటింగ్ కి వస్తున్నానని వివేక్ మాట్లాడడాన్ని వి. హెచ్ తప్పుబట్టారు

తెలంగాణ క్రికెట్ క్లబ్ ఉంటే నష్టమేమిటని హనుమంతరావు ప్రశ్నించారు.అజారుద్దీన్ అంతర్జాతీయ క్రీడాకారుడు ఆయన సేవలు వినియోగించుకుంటే తప్పేముందని అన్నారు. హెచ్‌సీఏ జరిపే టోర్నమెంట్ లలో ఓపెన్ ఆక్షన్ ఎందుకు పెట్టరో సమాధానం చెప్పాలన్నారు.తన ఎంపీ నిధులు రాజీవ్ గాంధీ స్విమ్మింగ్ ఫూల్, ఫుట్ బాల్ గ్రౌండ్, రాజీవ్ గాంధీ పేరుమీద పిల్లలకు స్టైఫండ్‌ ఇస్తున్నా, ఇది తన రికార్డ్ అని హనుమంతరావు అన్నారు.కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా వివేక్ తప్పుపడుతున్నారని హనుమంతరావు అన్నారు. 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *