Top Ad unit 728 × 90

మరో వారంలో... చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్2

మరో వారంలో... చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్2

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌2 మరో వారంలో చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఈ నెల 20న జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించి సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ అవుతుందని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు.

భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌ శతజయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శివన్‌ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ చంద్రయాన్‌ 2 విశేషాలను పంచుకున్నారు. గత నెల జులై 22న చంద్రయాన్‌-2ను ప్రయోగించిన తర్వాత.. ఐదు సార్లు కక్ష్య పెంపు ప్రక్రియలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు ప్రతి ప్రక్రియ విజయవంతమైందని ఇక అత్యంత కీలకమైన కక్ష్య పెంపు ప్రక్రియను బుధవారం ఉదయం చేపట్టనున్నాట్లు తెలిపారు.ఆగస్టు 14న తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ట్రాన్స్‌-లూనార్‌ ఇంజెక్షన్‌ ప్రక్రియ జరుపుతామన్నారు. దీంతో చంద్రయాన్‌ -2 భూకక్ష్యను వదిలి చంద్రుడి కక్ష్య దిశగా పయనిస్తుందని తెలిపారు. ఆ తర్వాత లూనార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌ ప్రక్రియ చేపడతామని, ఆగస్టు 20 నాటికి జాబిల్లి స్థిర కక్ష్యలోకి ప్రవేశిస్తుందన్నారు. అప్పుడు కూడా కొన్ని కక్ష్య పెంపులు చేపట్టిన తర్వాత చివరగా సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగుతుందన్నారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

మరో వారంలో... చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్2 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *