Top Ad unit 728 × 90

నెలరోజుల్లో 10 లక్షల ఫోన్ల విక్రయం.. 'రెడ్‌మీ నోట్ 7' రికార్డు

 నెలరోజుల్లో 10 లక్షల ఫోన్ల విక్రయం.. 'రెడ్‌మీ నోట్ 7' రికార్డు

విక్రయాల్లో షావోమీకి చెందిన రెడ్‌మీ కొత్త ఫోన్లు సరికొత్త రికార్డును క్రియేట్ చేశాయి. తాజాగా షావోమీ సంస్థ విడుదల చేసిన రెడ్‌మీ నోట్ 7 సిరీస్ ఫోన్లను రికార్డు స్థాయిలో విక్రయించారు. కేవలం నెలరోజుల్లోనే రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రొ ఫోన్ల విక్రయాలు భార‌త్‌లో 10 ల‌క్షల మార్క్‌ను దాటాయ‌ని సంస్థ వెల్లడించింది. భార‌త్‌లో ఈ ఫోన్లు లాంచ్ అయిన కేవ‌లం నెలరోజుల వ్యవధిలోనే ఇంత పెద్దఎత్తున ఫోన్లు సేల్ కావడం విశేషం. 

మరోవైపు అంత‌ర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్ల విక్రయాల సంఖ్య 40 ల‌క్షలు దాటిన‌ట్లు సంస్థ వెల్లడించింది. ఇక చైనాలో ఈ ఫోన్లు లాంచ్ అయిన 3 వారాల్లోనే విక్రయాల సంఖ్య 10 లక్షలు దాటినట్లు షావోమీ సంస్థ తెలిపింది. రెడ్‌మీ నోట్ 7 రూ.9,999 ప్రారంభ ధ‌ర‌కు వినియోదారుల‌కు ల‌భిస్తుండ‌గా, రెడ్‌మీ నోట్ 7 ప్రొ రూ.13,999 ప్రారంభ ధ‌ర‌కు వినియోగదారులకు లభ్యమవుతోంది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

నెలరోజుల్లో 10 లక్షల ఫోన్ల విక్రయం.. 'రెడ్‌మీ నోట్ 7' రికార్డు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *