శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోరం ప్రమాదం...!
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోరం ప్రమాదం... సీట్లో తెగిపడిన తల
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో వ్యక్తి కారు అద్దంలో ఇరుక్కుపోయాడు.
ప్రమాదం అనంతరం కారు ఆగకుండా లాక్కొని పోవడంతో మెడ తెగిపడింది. సోమవారం రాత్రి 8గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కారును సీజ్ చేసి కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు శంషాబాద్ మున్సిపాలిటీ ఉట్ పల్లి గ్రామానికి చెందిన తోట్ల అంజయ్యగా పోలీసులు గుర్తించారు.
సోమవారం రాత్రి 8గంటల ప్రాంతంలో ఓఆర్ఆర్ తోండుపల్లి టోల్ గేట్ దగ్గర వృద్ధుడు అంజయ్య రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయంపై శంషాబాద్ రూరల్ సీఐ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... గచ్చిబౌలి నుంచి తుక్కుగూడ వెళ్ళుతున్న కారు రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.
కారు బలంగా ఢీ కొట్టడంతో వృద్ధుడు ఎగిరి కారుమీద పడ్డాడు. కారు ముందు అద్దం పై పడడంతో శరీరం నుంచి తల, మొండెం వేరయ్యాయి. ముందు సీట్లో తల పడిందని సీఐ నరేందర్ రెడ్డి తెలిపారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చరీకి తరలించామని, కారు డ్రైవర్, కారును అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు.