Top Ad unit 728 × 90

మార్కెట్లు... నేడూ ముందుకే

మార్కెట్లు... నేడూ ముందుకే

ముంబయి: దేశీయ మార్కెట్లు లాభాల జోరు కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు కీలక రంగాల షేర్లలో కొనుగోళ్ల సూచీలను ముందుకు నడిపించాయి. ఫలితంగా నేటి సెషన్‌లో సూచీలు లాభాలతో ముగిశాయి.

సోమవారం నాటి ట్రేడింగ్‌లో లాభాలను దక్కించుకున్న మార్కెట్లు.. ఈ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అయితే లోహ, బ్యాంకింగ్‌, మౌలిక, ఆటోమొబైల్‌ రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో కొద్ది క్షణాల్లోనే కోలుకున్న సూచీలు లాభాల బాట పట్టాయి. ఒక దశలో సెన్సెక్స్‌ దాదాపు 170 పాయింట్ల లాభంతో ట్రేడ్‌ అయ్యింది. చివరకు 125 పాయింట్లు లాభపడి 37,271 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 11,036 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.68గా కొనసాగుతోంది.

ఎన్ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌, టాటామోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, మారుతి సుజుకీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు రాణించగా ఓఎన్జీసీ, విప్రో, గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు నష్టపోయాయి.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

మార్కెట్లు... నేడూ ముందుకే Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *