Top Ad unit 728 × 90

కొనసాగుతున్న మార్కెట్ల పతనం

కొనసాగుతున్న మార్కెట్ల పతనం

స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలకు తోడు భారత్ సుంకాలను ఇంకా సహించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మదుపరుల్లో ఆందోళనను మరింత పెంచింది. ఫలితంగా లాభాల్లో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్ది నష్టాల్లోకి జారుకున్నది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గుచూపడం, వాహన అమ్మకాల్లో క్షీణత, డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కూడా సూచీల పతనానికి పరోక్షంగా దోహదం చేశాయి.బుధవారం 400 పాయింట్ల స్థాయిలో తచ్చాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 173.78 పాయింట్లు పతనం చెంది 38,557.04 వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 57 పాయింట్లు కోల్పోయి 11,498.90 వద్ద క్లోజ్ అయింది. సూచీలు వరుసగా నాలుగో రోజు పతనం చెందినట్లు అయింది. బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా 4.91 శాతం పతనం చెంది టాప్ లూజర్‌గా నిలిచింది. వీటితోపాటు టాటా స్టీల్, టాటా మోటర్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎస్‌బీఐలు మూడు శాతం వరకు మార్కెట్ వాటాను కోల్పోయాయి. కానీ, యెస్ బ్యాంక్, సన్‌ఫార్మా, కొటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లు రెండు శాతం వరకు లాభపడ్డాయి. అమ్మకాలు పడిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ సంస్థలకు చమురు ధరల రూపంలో గట్టి షాక్ తగిలిందని, కార్పొరేట్ల నిరుత్సాహక ఆర్థిక ఫలితాలతో ఐటీ స్టాకులు దిగువముఖంగా ప్రయాణించాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద నాయర్ తెలిపారు. రంగాలవారీగా చూస్తే క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఇండస్ట్రీయల్, మెటల్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకోలేకపోవడంతో రెండు శాతం వరకు పతనం చెందాయి. ఆసియా మార్కెట్లలో షాంఘై కంపోజిట్ ఇండెక్స్, నిక్కీలు పతనం చెందగా, హ్యాంక్ సెంగ్, కోస్పిలు లాభాల్లో ముగిశాయి.

టాటా షేర్ల భారీ క్షీణత...

టాటా గ్రూపునకు చెందిన షేర్ల భారీ పతనం స్టాక్ మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయి. లగ్జరీ కార్ల సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు భారీగా పతనమైనట్లు గణాంకాలు విడుదల కావడంతో టాటా మోటర్స్ షేరు ధర ఏకంగా 3 శాతం క్షీణించింది. మార్కెట్ ముగిసే సమయానికి 2.79 శాతం కోల్పోయిన షేరు ధర రూ.151.40 వద్ద ముగిసింది. ఒక దశలో నాలుగు శాతానికి పైగా పతనమైన షేరు చివరికి నష్టాన్ని తగ్గించుకున్నది. మరోవైపు టీసీఎస్ ఆర్థిఖ ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలకు చేరుకోలేకపోవడంతో కంపెనీ షేరు ధర 1.11 శాతం పతనం చెంది రూ.2,107.70 వద్ద ముగిసింది.

వాహన షేర్లది అదే దారి...

గడిచిన నెలలో ప్యాసింజర్ వాహన విక్రయాలు ఎనిమిది నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) విడుదల చేసిన నివేదిక ఆటో రంగ షేర్లను అతలాకుతం చేసింది. టాటా మోటర్స్ షేరు 2.79 శాతం తగ్గగా, భారత్ ఫోర్జ్ 2.41 శాతం, టీవీఎస్ మోటర్ 2.12 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.77 శాతం, హీరో మోటోకార్ప్ 1.68 శాతం, బజాజ్ ఆటో 1.54 శాతం, ఐచర్ మోటర్స్ 1.39 శాతం, మారుతి సుజుకీ 0.31 శాతం చొప్పున పతనం చెందాయి. రంగాల్లో బీఎస్‌ఈ ఆటో రంగ సూచీ అత్యధికంగా 1.07 శాతం తగ్గి 16,948.23 వద్ద ముగిసింది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

కొనసాగుతున్న మార్కెట్ల పతనం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *