Top Ad unit 728 × 90

రిలయన్స్ కమ్యూనికేషన్స్ సమస్య: 90వేల కోట్ల రూపాయలను క్లెయిమ్ చేసుకోనున్న రుణదాతలు

రిలయన్స్ కమ్యూనికేషన్స్ సమస్య: 90వేల కోట్ల రూపాయలను క్లెయిమ్ చేసుకోనున్న రుణదాతలు

ముంబై: అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు రుణంగా డబ్బులు ఇచ్చిన రుణదాతలు ఇప్పుడు తమ డబ్బులను తిరిగి తీసుకోనున్నట్లు సమాచారం. దాదాపు రూ.90వేల కోట్లు వీరు తిరిగి పొందనున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ సంస్థ లెక్కల ప్రకారం రూ.46వేల కోట్లు ఉండగా అది దాదాపు రెట్టింపు అయ్యింది. దివాళా తీసిన కంపెనీ నుంచి ఇంత పెద్ద మొత్తంలో రుణదాతలకు డబ్బులు తిరిగి రావడం ఇదే తొలిసారి అవుతుంది.

ఇక బకాయిలు వెంటనే చెల్లించాల్సిందిగా దేశీయ బ్యాంకులతో పాటు, ప్రపంచ బ్యాంకులు, మొబైల్ ఫోన్ కంపెనీలు అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇక బకాయిలన్నీ రూ.75వేల కోట్ల నుంచి రూ.90వేల కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం. ఎవరెవరికి ఎంత చెల్లించాలో అనేదానిపై అన్ని వివరాలతో కూడిన క్లెయిమ్‌లను మే 21లోగా పంపాలని రిలయన్స్ సంస్థలో తలెత్తిన సమస్యను పరిష్కరిస్తున్న ఓ కమిటీ పేర్కొంది. ఇక ఇప్పటికే అన్ని లెక్కలు లెక్కించడం జరిగిందని ఆ డబ్బులు రూ.90వేల కోట్లు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.

జాతీయ బ్యాంకులతో పాటు చైనాకు చెందిన రుణదాతలు కూడా తమ వద్ద అప్పుగా తీసుకున్న డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఒక కంపెనీ మూతపడినప్పుడు ఇతరులకు ఇంత భారీ స్థాయిలో డబ్బులు చెల్లించడం అనేది వ్యాపార రంగంలో తొలిసారి అని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. ఇక రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు ఇతర సబ్సిడరీ కంపెనీల్లో చేసిన అప్పులను కూడా చెల్లించే అవకాశం ఉంది. దీంతో చెల్లించాల్సిన మొత్తం అసలు కంటే రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2016లో రిలయన్స్ జియో రంగప్రవేశం చేయడంతో అప్పటికే వెంటిలేటర్ పై ఉన్న అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ పూర్తిగా దివాళా తీసింది. దీంతో 2017లో చేసిన అప్పులు చెల్లించలేక కంపెనీ మూతపడింది. ఇక ఆ సంస్థకు చెందిన టెలిఫోన్ టవర్లు ఇతరత్ర సామగ్రిని కొనుగోలు చేయాలని రిలయన్స్ జియో భావించినప్పటికీ కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉండడటంతో ఆ ఆలోచన జియో విరమించుకుంది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

రిలయన్స్ కమ్యూనికేషన్స్ సమస్య: 90వేల కోట్ల రూపాయలను క్లెయిమ్ చేసుకోనున్న రుణదాతలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *