Top Ad unit 728 × 90

'జెట్‌ జోలికి వెళ్లడం లాభదాయంకం కాదు'

'జెట్‌ జోలికి వెళ్లడం లాభదాయంకం కాదు'

ముంబయి: గల్ప్‌ వైమానిక సంస్థ ఎతిహాద్‌ సోమవారం కీలక ప్రకటన చేసింది. సంక్షోభంలో ఉన్న జెట్‌ఎయిర్‌వేస్‌లో మళ్లీ పెట్టుబడులు పెట్టబోమని పేర్కొంది. పరిష్కారం కాని సమస్యలు, రుణాల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నామని పేర్కొంది. సంక్షోభం కారణంగా ఏప్రిల్‌ 17న జెట్‌ ఎయిర్‌వేస్‌ను మూసివేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దివాల ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు దాదాపు 3 కంపెనీలు ప్రాథమికంగా బిడ్స్‌ను దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో తాము 'ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌'ను దాఖలు చేయలేదని వెల్లడించారు. ప్రస్తుతం ఈ డీల్‌కు సంబంధించిన ఈవోఐలను దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 10తోనే ముగిసింది.

''జెట్‌ ఎయిర్‌వేస్‌లో పెట్టుబడి పెట్టడం ఎతిహాద్‌ బాధ్యత కాదు.. లాభదాయకం అంతకంటే కాదు.. భారత్‌కు ఇచ్చిన హామీపై ఈ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపించదు. జెట్‌కు సరైన పరిష్కారం చూపించాలని కోరుతున్నాము. మైనార్టీ షేర్‌ హోల్డర్‌ అయిన ఎతిహాద్‌కు అంత సామర్థ్యం లేదు.'' అని ఒక ప్రకటనలో పేర్కొంది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

'జెట్‌ జోలికి వెళ్లడం లాభదాయంకం కాదు' Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *