Top Ad unit 728 × 90

అప్పుల వసూళ్ల వేటలో బీఎస్ఎన్ఎల్

అప్పుల వసూళ్ల వేటలో బీఎస్ఎన్ఎల్

న్యూఢిల్లీ: నిర్వహణ నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) తమకు రావాల్సిన ఆదాయ వనరులను పెంపొంది చుకోవడంపై దృష్టిసారిస్తోంది. సంస్థకు తక్షణం చెల్లించాల్సి అప్పులు గుదిబండలా తయారయ్యాయి. దీంతో సంస్థ తాజాగా కార్పొరేట్‌ క్లయింట్ల నుంచి బాకీలను వసూలు చేసుకునే పనిలో పడింది. దాదాపు రూ. 3,000 కోట్ల మేర పేరుకుపోయిన బకాయిల్లో సింహభాగం మొత్తాన్ని వచ్చే రెండు, మూడు నెలల్లో వసూలు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని కంపెనీ సీఎండీ పి.కె. పుర్వార్‌ వెల్లడించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు జీతాలను కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పుర్వార్‌ వెల్లడించిన విషయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'ఎంటర్‌ప్రైజ్‌ కస్టమర్స్‌ నుంచి దాదాపు రూ. 3,000 కోట్ల బకాయిలు రావాలి. వాటిని రాబట్టుకునేందుకు రోజువారీ చర్యలు మరింత ముమ్మరం చేశాం. కచ్చితంగా రాబట్టుకుంటాం' అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎప్పట్లోగా మొత్తం రికవర్‌ అవుతుందన్నది చెప్పడం కష్టమని, అయితే వచ్చే రెండు, మూడు నెలల్లో అధిక భాగాన్ని రాబట్టుకోగలమని తెలిపారు. మరోవైపు, భవంతులు మొదలైనవి లీజుకివ్వడం ద్వారా ఈ ఏడాది కనీసం రూ. 1,000 కోట్లు అద్దెల రూపంలో ఆదాయాలను పెంచుకోవాలనేది బీఎస్‌ఎన్‌ఎల్‌ యోచన. గతంలో ఈ మొత్తం రూ. 200 కోట్లు. వీటితో పాటు అవుట్‌సోర్సింగ్‌ కార్యకలాపాల క్రమబద్ధీకరణ ద్వారా ఏటా రూ. 200 కోట్లు ఆదా చేసుకోవాలని, విద్యుత్‌ బిల్లుల భారాన్ని 15 శాతం మేర తగ్గించుకోవాలని సంస్థ ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసింది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

అప్పుల వసూళ్ల వేటలో బీఎస్ఎన్ఎల్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *