Top Ad unit 728 × 90

పోస్టాఫీసు ఉన్న ప్రతీ గ్రామంలో అన్ని బ్యాంకులు, వాటి ఏటీఎంలు ఉన్నట్లే లెక్క...!

పోస్టాఫీసు ఉన్న ప్రతీ గ్రామంలో అన్ని బ్యాంకులు, వాటి ఏటీఎంలు ఉన్నట్లే లెక్క...!

'ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌' తన ఖాతాదారులకు మరింత చేరవవుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలను గతేడాది అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పదిహేను రోజుల క్రితం 'ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సర్వీస్'లను ప్రవేశపెట్టింది. కాగా కొద్ది రోజులకే ఈ సౌకర్యంపట్ల వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుండడం విశేషం.

ఏటీఎం కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలతో పనిలేకుండా నేరుగా పోస్టాఫీసుకు వెళ్లి వేలిముద్ర వేయడం ద్వారా నగదు తీసుకునే సౌకర్యమిది. అయితే... ఖాతాదారునికి తన ఆధార్‌తో అనుసంధానమై ఉన్న నాలుగు బ్యాంకు అకౌంట్లు ఉన్నపక్షంలో... ఆధార్‌ డేటాబేస్‌లో చివరిసారి ఏ బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉందో ఆ బ్యాంకు ఖాతా నుంచి మాత్రమే నగదు తీసుకునే అవకాశముంటుంది.

ఈ విధానం ద్వారా కొన్ని బ్యాంకులు రోజుకు గరిష్టంగా రూ. 10 వేలు, మరికొన్ని బ్యాంకులు రూ. 5 వేలు మాత్రమే తీసుకోవడానికి అనుమతిస్తున్నాయి. ఈ క్రమంలో, బ్యాంకులు, ఏటీఎంలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ ద్వారా పూర్తి స్థాయి బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చినట్లైంది.

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకులో కొద్ది రోజులుగా ఖాతాల పెంపుపై అధికారులు దృష్టి సారించారు. ఈ ఖాతాల్లో గరిష్టంగా రూ. లక్షకు మించి దాచుకోవడానికి వీలుండదు. దీంతో వీటిని పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతాలకు అనుసంధానిస్తున్నారు. దీనివల్ల రూ. లక్షకు మించి ఉన్న నగదు నేరుగా సేవింగ్స్‌ ఖాతాలోకి వెళ్తుంది, అవసరమైనప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. పోస్టాఫీసు అందిస్తున్న బ్యాంకింగ్‌ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను కూడా చేపట్టామని ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ రామ్‌ తెలిపారు.

పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఖాతాలను ప్రారంభించడంలో ఏపీ సర్కిల్‌ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10.33 లక్షల ఖాతాలతో రూ. 21.59 కోట్ల డిపాజిట్లను సేకరించింది. ఏడు నెలల్లోనే 6.91 లక్షల ఖాతాలను ప్రారంభించారు. ఆధార్‌ ఎనేబుల్డ్‌ సర్వీస్‌ ద్వారా పూర్తి స్థాయి బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పోస్టాఫీసు ఉన్న ప్రతీ గ్రామంలో అన్ని బ్యాంకులు, వాటి ఏటీఎంలు ఉన్నట్లే లెక్క.

 

పోస్టాఫీసు ఉన్న ప్రతీ గ్రామంలో అన్ని బ్యాంకులు, వాటి ఏటీఎంలు ఉన్నట్లే లెక్క...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *