Top Ad unit 728 × 90

50 వేల ఉద్యోగాలు

50 వేల ఉద్యోగాలు

దేశీయ ఐటీ దిగ్గజ సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 50 వేల మందిని కొత్తగా నియమించుకున్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ 29,287 మందిని నియమించుకోగా ఇన్ఫోసిస్‌ 24,016 మందిని రిక్రూట్‌ చేసుకున్నట్లు ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి టీసీఎస్‌ ఉద్యోగుల సంఖ్య 4,24,285కు చేరుకోగా ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల సంఖ్య 2,28,123గా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ సంస్థలు కేవలం 11 వేల మంది ఉద్యోగులను మాత్రమే నియమించుకోవటం గమనార్హం. కాగా విప్రో, హెచ్‌సీఎల్‌, కాగ్నిజెంట్‌ సంస్థలు కూడా ఓ మోస్తరు స్థాయిలోనే ఉద్యోగులను నియమించుకున్నాయి. గత ఏడాది డిసెంబరునాటికి ఈ కంపెనీలు దాదాపు 50 వేల వరకు నియామకాలు చేపట్టాయి.

త్వరలోనే ఈ కంపెనీల ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ కంపెనీలు భారీగానే ఉద్యోగులను నియమించుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులతోపాటు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉండటం కలిసి రానుందని నిపుణులు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాబోయే కొత్త ప్రభుత్వం ఈ రంగానికి ప్రోత్సాహకాలను అందిస్తే రిక్రూట్‌మెంట్‌ ఆశించిన స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీయ ఐటీ కంపెనీలు ప్రధానంగా డిజిటల్‌ వ్యాపారంపై దృష్టి సారించటంతో నియామకాలు పెరగటానికి దోహదపడిందన్నారు.

2017-18లో పింక్‌ స్లిప్పులు..! ఆటోమేషన్‌, ప్రాజెక్టులు లేకపోవటం, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ మారిపోవటం సహా ఇతరత్రా అంశాలతో దేశీయంగా పలు ఐటీ కంపెనీలు.. చాలా మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్పులు ఇచ్చాయి. హెచ్‌1బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠినంగా వ్యవహరించటం కూడా భారత ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అయితే గడచిన ఆర్థిక సంవత్సరం (2018-19)లో పరిస్థితి మెరుగుపడటం కలిసి వచ్చింది. కొత్తగా ప్రాజెక్టులను చేజిక్కించుకోవటం, నయా టెక్నాలజీలకు అనుగుణంగా నిపుణులు లభించటం వంటి అంశాలతో రిక్రూట్‌మెంట్‌ పెరిగిందని ఐటీ రంగ నిపుణులు వెల్లడించారు. మరోవైపు ఐటీ దిగ్గజ సంస్థలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, కాగ్నిజెంట్‌ వంటి సంస్థలు అమెరికా నిబంధనలకు అనుగుణంగా స్థానికులను రిక్రూట్‌ చేసుకున్నాయి. ఇది కూ డా ఐటీ రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపించిం ది. గత ఏడాది అమెరికాలో ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల సంఖ్య 10 వేలను దాటడం విశేషం.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

50 వేల ఉద్యోగాలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *