Top Ad unit 728 × 90

రఫేల్‌ ఒప్పందంలో చీకటికోణం బయటపడింది

రఫేల్‌ ఒప్పందంలో చీకటికోణం బయటపడింది

దిల్లీ: అనిల్ అంబానీపై ఫ్రెంచ్‌ పత్రిక లీ మోండే వెలువరించిన కథనంపై కాంగ్రెస్‌ స్పందించింది. రఫేల్‌ ఒప్పందం కుదిరిన కొన్ని నెలల తర్వాత అంబానీకి చెందిన రిలయన్స్‌ అట్లాంటిక్‌ సంస్థకు భారీగా పన్ను మినహాయింపు లభించిందని ఆ పత్రిక కథనం రాసింది.దీనిపై కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా మాట్లాడారు. రఫేల్ ఒప్పందంలో ఎంతటి చీకటి కోణం ఉందో, మరెంత అవినీతి దాగి ఉందో ఇప్పుడు బట్టబయలైందని విమర్శించారు.

‘ఎలాంటి ఉపయోగం లేని ఓ కంపెనీకి పన్ను మినహాయింపు లభించింది. ప్రధాని మోదీ కృప వల్ల అనిల్ అంబానీకి 143.7 మిలియన్‌ యూరోల లబ్ధి చేకూరింది. ఆయన  ప్రభుత్వం పేదలకు పన్ను రాయితీలు ఇవ్వడం మరిచి ధనవంతులకు రాయితీలు ఇవ్వడంలో మునిగిపోయి ఉంది. ఎన్డీయే ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, రఫేల్‌ ఒప్పందంలో అనిల్‌ అంబానీ పాత్ర ఉందని చెప్పడానికి ఇంతకంటే రుజువులు అవసరం లేదేమో. తమ ప్రభుత్వం అవినీతి రహిత భారతదేశాన్ని అందిస్తోందని భాజపా చెప్పుకుంటోంది. ఇప్పుడేమంటారు?. ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా ప్రజలను మోసం చేయాలనుకుంటే వారు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు’ అంటూ తీవ్రంగా ఆరోపించారు.

అంబానీకి చెందిన రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్‌ ఫ్రాన్స్‌ అనే సంస్థ ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి 151 మిలియన్ యూరోలు చెల్లించాల్సి ఉండగా కేవలం 7.6 మిలియన్‌ యూరోలు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకొంది. మిగిలిన 143.7 మిలియన్‌ యూరోలను ఫ్రాన్స్‌ రద్దు చేసిందని లీ మోండే వివరించింది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

రఫేల్‌ ఒప్పందంలో చీకటికోణం బయటపడింది Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *