Top Ad unit 728 × 90

బీజేపీలోకి టీఆర్‌ఎస్‌, టీడీపీ నేత... కిషన్‌రెడ్డితో రహస్య మంతనాలు?

బీజేపీలోకి టీఆర్‌ఎస్‌, టీడీపీ నేత... కిషన్‌రెడ్డితో రహస్య మంతనాలు?

హైదరాబాద్: టీడీపీలో నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఓ నేత త్వరలో బీజేపీలో చేరుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రతి శని, ఆదివారాల్లో సికింద్రాబాద్‌ ప్రజలకు అందుబాటులో ఉంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని ఓ రోజు మధ్యరాత్రి రహస్యంగా పదిమంది కార్యకర్తలతో ఆ టీఆర్‌ఎస్‌ నేత కలిసినట్టు తెలిసింది. 2014లో కార్పొరేటర్‌ సీటు కావాలని అప్పటి డిప్యూటీ స్పీకర్‌ పద్మారావును కోరగా కుదర్లేదు. ఈ సారీ మళ్లీ అడ్డగుట్ట కార్పొరేటర్‌గా ఉన్న విజయ కుమారికి రెండో సారీ కూడా అవకాశం ఇస్తున్నట్టు డివిజన్‌లో విస్తృత ప్రచారం జరుగుతుండటంతో ఇక లాభం లేదనుకున్న ఆ టీఆర్‌ఎస్‌ నేత పద్మారావు కార్యక్రమాలకు హాజరవుతూనే బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. తన భార్యకు కార్పొరేటర్‌ సీటు వస్తుందని కొండంత ఆశతో ఉంటే ఈ సారీ కూడా లాభం లేదనుకున్న ఆ నేత బీజేపీ బాటలో నడుద్దామని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ఆ నేత మాకొద్దని కిషన్‌రెడ్డిని కలవనున్న డివిజన్‌ బీజేపీ నేతలు...!

అడ్డగుట్ట డివిజన్‌ కార్పొరేటర్‌ సీటు కోసం పార్టీలు మారతూ ఓ టీఆర్‌ఎస్‌ నేత బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరగడంతో ఆ నేత మాకొద్దని బీజేపీ డివిజన్‌ నాయకులు అంటున్నారు. ఈ విషయమై బీజేపీ నాయకులు త్వరలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కలవనున్నట్టు తెలిపారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

బీజేపీలోకి టీఆర్‌ఎస్‌, టీడీపీ నేత... కిషన్‌రెడ్డితో రహస్య మంతనాలు? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *