Top Ad unit 728 × 90

నూతన మున్సిపల్ చట్టానికి గవర్నర్ నో...

నూతన మున్సిపల్ చట్టానికి గవర్నర్ నో...

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మున్సిపల్‌ చట్టానికి గవర్నర్‌ ఆమోదం లభించలేదు. ఆ చట్టానికి పలు సవరణలను సూచిస్తూ గవర్నర్‌ నరసింహన్‌ దాన్ని తిప్పిపంపారు. దీంతో ఆయన సూచించిన సవరణలతో కూడిన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. చట్టంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పొందుపరిచిన అంశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘానికి అధికారాలను తొలగించటం, ప్రజా ప్రతినిధులను తొలగించే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించటం, 85 శాతం మొక్కలు నాటకపోతే వార్డు మెంబర్లను తొలగిస్తామనటం తదితరాంశాలపై గవర్నర్‌ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వీటిని సవరించాలని సూచిస్తూ స్థానిక సంస్థలకు హక్కులు కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సూచించిన సవరణలతో కూడిన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. అసెంబ్లీ ప్రొరోగ్‌ కావటంతో ఆర్డినెన్సును తీసుకొచ్చారు. మరోవైపు దీన్ని చట్టం రూపంలో తీసుకురావాలంటే మరోసారి అసెంబ్లీని సమావేశపరచాల్సిన అవసరముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆర్డినెన్సును తెచ్చిన నేపథ్యంలో ఆర్నె ల్ల వరకూ శాసనసభను సమావేశపరచాల్సిన అవసరం లేదని వారు తెలి పారు. మరోవైపు గవర్నర్‌ అభ్యంతరాలపై వెంటనే స్పందించిన ప్రభుత్వం గత ఆదివారమే సవరణలను ప్రతిపాదిస్తూ ఆర్డినెన్సును విడుదల చేసింది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

నూతన మున్సిపల్ చట్టానికి గవర్నర్ నో... Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *