Top Ad unit 728 × 90

దారుణం... బిల్లు కట్టలేనందుకు కళ్లు, కిడ్నీలు, గుండె...!

దారుణం... బిల్లు కట్టలేనందుకు కళ్లు, కిడ్నీలు, గుండె...!

భర్త బ్రెయిన్ డెడ్ అయి ఆసుపత్రి బెడ్‌పై అచేతనంగా పడి ఉన్నాడు. భార్య బిల్లు కట్టే పరిస్థితిలో లేదు. అప్పటికే లక్ష అయింది. కట్టలేనంటే ఆయన కళ్లు, కిడ్నీలు, గుండె ఆస్పత్రికి దానం చేయమంది యాజమాన్యం. నెల్లూరు జిల్లాలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏకొల్లు శ్రీనివాసులు అనే వ్యక్తి నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని వడ్డెపుగుంట వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.  బైక్‌తో ఢీకొట్టిన వ్యక్తి వెంటనే అతడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లాడు.

ముందు చికిత్స కోసం రూ.20 వేలు కట్టి జాయిన్ చేశాడు. విషయం తెలుసుకున్న భార్య హుటాహుటిన ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు ఆమెతో నీ భర్తకు బ్రెయిన్ డెడ్ అయింది. ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని సూచించారు. అయినా బ్రతుకుతాడన్న భరోసా ఇవ్వలేమని చెప్పారు రెండో రోజు. అయితే ఇప్పటి వరకు అయిన బిల్లు లక్ష రూపాయలు చెల్లించమన్నారు. దానికి ఆమె తన వద్ద అంత డబ్బు లేదని చెప్పింది. వైద్యులు అలా చెప్పిన మధ్యాహ్నానికే శ్రీనివాసులు మరణించాడని బాడీని తీస్కెళ్లాలంటే లక్ష కట్టాలని సూచించారు. మరోమాట కూడా చెప్పారు.

లక్ష కట్టలేకపోతే రెండు కళ్లు, రెండు కిడ్నీలు, గుండె, ఈ అవయవాలను దానం చేస్తే బిల్లు కట్టక్కరలేదన్నారు. ఇంకా మీ కుటుంబం అంతటికీ భవిష్యత్తులో ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. ఇంతకు ముందు కట్టిన రూ.20వేలు కూడా ఇచ్చేస్తామన్నారు. అందుకోసం ఏవో పేపర్లు తీసుకొచ్చి వాటన్నింటి మీద సంతకాలు పెట్టించుకుని అవయవాలన్నీ తీసుకున్నారని శ్రీనివాసులు భార్య ఆరోపిస్తుంది. ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఆమె అనుమతి తీసుకునే చేశామంటోంది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

దారుణం... బిల్లు కట్టలేనందుకు కళ్లు, కిడ్నీలు, గుండె...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *